YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ పార్టీలో సస్పెష్షన్ ల పర్వం

కాంగ్రెస్ పార్టీలో సస్పెష్షన్ ల పర్వం

విజయవాడ, అక్టోబరు 20, 
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెష్షన్ ల పర్వం కొనసాగుతోంది. మరో కీలక నేతపై వేటు వేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్ (డీవై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీవై దాస్ పై బహిష్కరణ వేటు వేసినట్లు వైసీపీ ప్రకటించింది. పామర్రు నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాస్.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై వచ్చిన ఆరోపణలతో క్రమశిక్షణ సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారు.వైసీపీ పార్టీ అధికారం తిరిగి దక్కించుకునేందుకు అధినేత, సీఎం జగన్ టార్గెట్ 175 పేరుతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటుగా ఎలాంటి పరిస్దితులను అయినా ఎదుర్కొనే విధంగా కార్యచరణను డిసైడ్ చేసుకుంటున్నారు. ఇందుకు ప్రధానంగా పార్టీ పటిష్టపై అదే స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులపై బాధ్యతల బరువును పెంచుతూ ఇంఛార్జ్‌లు గడప గడపకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల్లో ఉన్న వారికి మాత్రమే పార్టీ పదవులు, బాధ్యతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇటీవల తాడేపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశంలో జగన్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ నాయకులు అంతా గడప గడపకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకోవటంతో సహా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారని సమాచారం.రాష్ట్ర ప్రభుత్వ పాలన, పార్టీ నిర్వహణను సమాంతరంగా నడిపించేందుకు జగన్ కీలకమయిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా నియోజకవర్గాల వారీగా ఉన్న కొందరు నాయకులు పార్టీ కోసం చేయకుండా, కేవలం విభేదాలకు మాత్రమే అధికంగా ప్రాధాన్యత ఇవ్వటం కూడా సమస్యగా మారింది. ఇలాంటి విషయాలపై జగన్ చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన జోష్ పెరిగిపోవడంతో పార్టీలో మాట వినని నాయకులు, పని చేయని నాయకులు, విభేదాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే కొందరు నాయకులను సాగనంపేందుకు వెనకాడటం లేదు. అలాంటి నాయకులకు పని తీరు మార్చుకోవాలని టైం కూడా ఇవ్వకుండానే నేరుగా సస్పెన్షన్ వేటు వేసేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన రావి వెంకట రమణపై జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ స్థాపించన నాటి నుంచి నియోజవకర్గంలో రావి పని చేశారు. పార్టీని నమ్ముకొని అనేక సందర్బాల్లో ప్రజా పోరాటాలు కూడ చేశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్నపొన్నూరు నియోజకవర్గంలో వైసీపీకి ఊపిరి పోశారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం రావికి టిక్కెట్ దక్కలేదు. దీంతో అప్పటి నుండి రావి పార్టీలోనే ఉంటున్నా, అంతగా క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు.  ఎమ్మెల్యే కిలారి రోశయ్యతో వచ్చిన విభేదాలు, పార్టీ దృష్టికి రావి వ్యవహరం వెళ్ళింది. దీంతో క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి నివేదికను పార్టీ అధినేత జగన్ ముందు ఉంచారు. దీంతో రావిని సస్పెండ్ చేశారు.ఇదే కోవలో ఇప్పుడు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దాస్ కూడా చేరారు. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ తో విభేదాలు రావటంతో దాస్ వేరు కుంపటి పెట్టారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు గ్రూపులుగా తయారయ్యింది. పార్టీకి చెందిన శాసన సభ్యుడు ఉండగా ఆయన్ను కాదని పని చేయటం, సరికాదని కలసి పని చేసుకోవాలని పార్టీ నుండి వచ్చిన సూచనలను దాస్ పట్టించుకోకపోవటంతో సస్పెన్షన్ తప్పలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

Related Posts