YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ పేరుతో కొడాలి మైండ్ గేమ్

ఎన్టీఆర్ పేరుతో కొడాలి మైండ్ గేమ్

విజయవాడ, అక్టోబరు 21, 
ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు చుట్టూ ఎప్పుడు రాజకీయం నడుస్తూనే ఉంటుంది. అటు మన మధ్య లేని సీనియర్ ఎన్టీఆర్ పేరు అయినా, ఇటు సినిమాల్లో టాప్ హీరోగా ఉంటూ, రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పేరు అయినా సరే రాజకీయాల్లో వినబడుతూనే ఉంటాయి. అయితే వీరి పేర్లు ద్వారా టీడీపీకి డ్యామేజ్ చేయాలని వైసీపీ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది.
సీనియర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఆయన చావుకు కారణం బాబు అని..పాత పాటనే వైసీపీ నేతలు మళ్ళీ పాడుతుంటారు. అలాగే జూనియర్‌ని బాబు వాడుకుని వదిలేశారని, లోకేష్ కోసం జూనియర్‌ని తోక్కేయడానికి చూస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ సీనియర్ అయినా, జూనియర్ అయినా వారి అభిమానుల ఓట్లు టీడీపీకి పడకుండా వైసీపీకి పడేలా చేయడమే వైసీపీ నేతల టార్గెట్‌గా ఉంది. అలాగే టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని చెప్పి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉంటారు.వైసీపీ రాజకీయం జరుగుతూ ఉంటుంది..ఇక వైసీపీ విమర్శలకు టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తుంటారు. కాకపోతే ఒకోసారి జూనియర్ విషయంలో ఇబ్బందులు వస్తాయి. ఏదైనా రాజకీయ సమస్యలు వచ్చినప్పుడు ఎన్టీఆర్..న్యూట్రల్‌గా స్పందించినప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతూ ఉంటాయి. ఇదే అదునుగా టీడీపీలో చిచ్చు పెట్టాలని వైసీపే చూస్తూ ఉంటుంది. అయితే సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఎక్కువ తీసేది కొడాలి నానినే. వారి ద్వారా కొడాలి, బాబుని టార్గెట్ చేస్తారు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు చేసిన కామెంట్లకు కొడాలి కౌంటర్ ఇచ్చేశారు. మళ్ళీ అదే వెన్నుపోటు రాగం పాడారు, ఇక జూనియర్‌ని తోక్కేస్తున్నారని మాట్లాడారు. ఇక నానికి టీడీపీ నుంచి గట్టి కౌంటర్లు వచ్చాయి. ఎన్టీఆర్ పేరుతో కొడాలి మైండ్ గేమ్ ఆడుతున్నారని, అసలు సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌ పేర్లు వాడుకుంటుంది కొడాలి నాని అని, జూనియర్‌ని వాడుకుని వదిలేశారని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరుతో మైండ్ గేమ్ ఆడితే గట్టిగా బుద్ధి చెబుతామని అన్నారు.
1999 ఎన్నికల్లో అన్న టీడీపీ పెట్టి హరికృష్ణ..గుడివాడలో పోటీ చేస్తే..తన అనుచరుల ద్వారా హరికృష్ణ ఓడిపోయేలా పనిచేసింది కొడాలి నాని అని, రావి వెంకటేశ్వరావు ఆరోపించారు. హరికృష్ణకు కొడాలి వెన్నుపోటు పొడిచారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు పాత విషయాలు తీసి బాబుని ఇరుకున పెడుతున్న కొడాలికి టీడీపీ నేతలు కూడా పాత విషయాలు తీసి చెక్ పెట్టడానికి చూస్తున్నారు

Related Posts