YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఊరించి..ఊసూరుమనిపించిన రఘువీరా

ఊరించి..ఊసూరుమనిపించిన రఘువీరా

అనంతపురం అక్టోబరు 21, 
సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి మరోసారి తన అనుచరులను ఊరించి ఉసూరుమనిపించారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ కాన్వాయ్ తో మాజీ పీసీసీ రఘువీరా డి .హీరేహాల్ కు వచ్చారు. దీంతో రాజకీయ పునః ప్రవేశం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కానీ పొలిటికల్ రీ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన చేస్తాడని ఆయన అనుచరులలో ఉత్సాహం కనిపించింది. అయితే ఏ ప్రకటన చేయకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశ నిస్పృహ లకు గురైనట్లు తెలుస్తోంది.ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి రఘువీరా ఇమడ లేరని వినిస్తోంది. అదే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేకపోతున్నారు. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే అవుడేటెడ్ నాయకుడిగా మిగిలిపోతానేమోనని ఎప్పటికప్పుడు తన రాజకీయ ప్రకటనను రఘువీరా రెడ్డి దాటవేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చిన రాహుల్ గాంధీని కలవడానికి భారీ కాన్వాయ్ తోనే రఘువీరా వచ్చారు. ఈ సందర్భంగా రాజకీయ పునః ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటిస్తారని అనుచరులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులందరూ భావించారు. కీలక సమయంలోనూ రఘువీరా మౌనమే మార్గం!ఏ ప్రకటన చేయకుండా మౌనం వహించడంతో కార్యకర్తలలో నిరాశ నెలకొంది. అప్పటికే రఘువీరా నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఆయన అనుచరులు ఏ ప్రకటన వెలబడకపోయేసరికి మధ్యలోనే అక్కడి నుంచి నిష్క్రమించారు. ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం కూడా ఓ చర్య అన్న పంథాను కాంగ్రెస్ అగ్ర నాయకులు ఫాలో అవుతుంటారు. అదే తరహాలో రఘువీరా కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తును కాలానికే వదిలేసారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు అంధకారమయం అయింది. తిరిగి కాంగ్రెస్ పునరుజ్జీవం పోసుకోవాలంటే ఏవో అద్భుతాలు జరిగితే తప్ప సాధ్యం కానీ అంశం. ఈ పరిస్థితుల్లో రఘువీరా మరోసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారా లేక, రాజకీయాలకే దూరం కానున్నారా అన్న చర్చ ఇప్పుడు జోరు అందుకుంది.. రఘువీరారెడ్డి చెప్పినట్లుగానే ఆ యాత్రలో నీలకంఠాపురం దేవస్థానం తరపున పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి స్వామివారి తీర్థప్రసాదాలను రఘువీరారెడ్డి అందజేశారు. నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణ పనులు చాలా ఉన్నాయని, అవి పూర్తయ్యాక రాజకీయాలపై ఆలోచిస్తానంటూ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు.

Related Posts