YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

12 గంటలు పనిచేసినా కనిపించని ఉద్యోగ భద్రత

12 గంటలు పనిచేసినా  కనిపించని ఉద్యోగ భద్రత

ఎండ, వాన, చలి, రాత్రి, పగలు తేడా లేకుండా వారు పనిచేస్తారు. ఎక్కడ విద్యుత్‌ సమస్య వచ్చినా అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారమయ్యే వరకు శ్రమిస్తారు. ఇంత చేసినా వారి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. వారే విద్యుత్‌ శాఖలో ఏ సమస్య వచ్చినా నిరంతరం శ్రమించే కాంట్రాక్ట్‌ కార్మికులు. ప్రభుత్వానికి ఆదాయం తప్ప మరేమీ కన్పించడం లేదు. సెక్షన్‌లో ఎన్ని సర్వీసులుండాలి? ఎన్ని వున్నాయి? ఎంత మంది ఓ అండ్‌ ఎం ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులున్నారనే దానితో సంబంధం లేకుండా పని భారం మోపుతున్నారు. పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలను మన కార్మికులు పోయి బిల్లులు కట్టండని వత్తిడి చేస్తే చాలు వెంటనే దాడులకు పాల్పడుతున్నారు. . తగినంత సిబ్బంది లేకపోవడంతో పది మంది చేసే పని ఒక్కరే చేయాల్సి వస్తోంది. దీంతో నిత్యం 8 గంటలు కాదు, దాదాపు 12 గంటల పాటు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఇది వారి శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో విద్యుత్‌ స్తంభాలపై పనిచేస్తున్న సమయంలో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాల బారిన పడి మృతి చెందాల్సి వస్తోంది.ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. పెరిగిన సర్వీసులకనుగుణంగా పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య పెంచటం లేదు. కాంట్రాక్ట్‌ అనే ముద్దు పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడి చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అనే చట్టాన్ని తుంగలో తొక్కి ప్రమాదకరమైన పనులను కాంట్రాక్ట్‌ కార్మికులతో చేయిస్తున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వాలని సుఫ్రీకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదేమి అన్యాయమని అడిగితే వైర్లు చుట్టడమే కదా అని ప్రశ్నిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అంటే జె.ఎల్‌.ఎంకి ఇస్తున్న జీతం కాంట్రాక్ట్‌ కార్మికులకు చెల్లించాలి. బేగంబజార్‌ డివిజన్‌ పరిధిలో తొమ్మిది డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయి. వీటిలో 230 మంది వరకు కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఎప్పుడో ఒకప్పుడు పర్మినెంట్‌ అవుతామనే నమ్మకంతో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. సంస్థకు వీరు చేస్తున్న సేవలను గుర్తించి చదువు, వయసుతో సంబంధం లేకుండా సీనియార్టీ ప్రకారం రెగ్యులరైజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

Related Posts