YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి కధలు...

అమరావతి కధలు...

విజయవాడ, అక్టోబరు 22, 
అమరావతి ప్రాంత గ్రామాలు రాజధాని గ్రామాల పేర్లు చరిత్రకు ఆధారాలుగా నేటికి సజీవంగా నిలి చా యి. అమరావతి రాజధాని ప్రకటనతో రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలతో పాటు అమరావతి సమీప గ్రామాల పేర్లు ఎలా ఉద్భవించాయనేది చరిత్ర పుట ల్లోకి వెళితే వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది. మొదటిగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా స్థానిక ఉద్దండరాయిని పాలెంలో అమరావతి శంఖుస్థాపన జరిగింది. ఉద్దండరాయిని పాలెం పేరు ఎలా వచ్చింది అనేది పరిశీలిస్తే , విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయలు ఆనాడు అమరావతిని పాలించారు. ఈ క్రమంలో రాయల వారి కొలువులో ఉద్దండరాయుడు అనే వ్యక్తి గొప్పసేనానిగా ఉండేవాడు. అంతేకాదు ఇతను శ్రీ కృష్ణదేవరాయల కు అత్యంత ప్రీతి పాత్రుడు. శ్రీకృష్ణ దేవరాయల వారి సామ్రాజ్య విస్తరణలో ఉద్దండ రాయుడు కీలకపాత్ర పోషించాడు. ఇక యుద్ధ విష యాల్లో ఉద్దండరాయుడు బాగా ఆరితేరినవాడు. ఆంధ్రుల రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దం డ రాయునిపాలెం ఆయన పేరు మీద ఏర్పడిన గ్రామం కావడమే ఇక్కడ విశేషం.  విజయ నగర సామ్రాజ్య విస్తరణలో భాగంగానాడు కొండపల్లి వెళ్లడానికి ముందు యుద్ధ విరామ సమయంలో శ్రీకృష్ణదేవ రాయలు బస చేసిన ప్రాంతం నేటి రాజధాని గ్రామం రాయపూడి. నాటి రాయలు పూడి  నేటి రాయపూడి.ఇక తుళ్ళూరు విషయానికి వస్తే, రాయల వారు 'తులు' వంశస్థులు కావడం తో నాడు రాయలు ఆధీ నంలో ఉన్న ప్రధాన కేంద్రంని అప్పట్లో 'తులూరు' గా నామకరణం చేశారు. ఇప్పుడు అది కాలక్రమేణా తుళ్లూరుగా రూపాంతరం చెందింది. మరో రాజధానిగ్రామం అబ్బరాజు పాలెం విషయా నికి వస్తే రాయల వారికి సామంతుడుగా ఉన్న అబ్బరాజు పేరిట అబ్బ రాజుపాలెం... అలాగే మరో సామంతుడు వెంక టప్ప పేరిట వెంకటపాలెం గ్రామాలు  అవతరించాయి. అలాగే కాకతీయ సామ్రాజ్య వీర వనిత రాణీ రుద్రమ దేవి కూడా  ఓరుగల్లు సామ్రాజ్య విస్తరణలో భాగంగా నాటి ధాన్యకటకం నేటి అమరావతిని వశం చేసుకుని పాలించారు. రాణీ రుద్రమదేవి పాలనకు గుర్తుగా అమరావతి లో తుళ్ళూరు తరువాత మరో ప్రధాన ప్రాంతంగా పిలువ బడుతున్న నేటి మందడం గ్రామమే నాటి మందారం.రుద్రమదేవి పాలనకు ఆధారాలు ఈ మందడం గ్రామాన్ని ఆనుకుని ఉన్న మల్కాపురం, వెలగపూడి గ్రామాల మధ్య 12-15 అడుగుల ఎత్తు రెండు, రెండున్న అడుగుల చుట్టుకొలత కలిగిన పెద్ద రాతి శాస నం రుద్రమదేవి పాలనలో ఆమె ఏర్పాటయింది. శాస‌నం పైభాగాన ఓ నంది విగ్రహం దర్శన మిస్తుం ది. ఈ నంది అమరావతి ప్రాంతానికి జల జీవనాధారమైన కృష్ణానది వైపు చూస్తున్నట్లుగా శాశనం పై నందిని ఏర్పాటు చేసి అమరావతి ఎందుకు ఆంధ్రుల రాజ ధానిగా ఉంది.అమరావతిని రాజవంశీకులు కృష్ణానది ఒడ్డున ఎందుకు ఏర్పాటు చేశారు అనే దానికి సూచిక ఈ శాశనం. ఇదే రుద్రమ దేవి వేసిన 'మందారస‌ శాస‌నం. ఈ  ప్రాంతమే కాల క్రమేణా మందార అని, త‌ర్వాత మందడంగా రాజధాని గ్రామ మైన మంద డం అనే పేరు స్థిర‌మైంది.ఇక అమరావతిలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో నేటి అమరావతి గ్రామమైన నవులూరు కేంద్రంగా నాడు 'నావ'ల ద్వారా పాలకులు జలరవాణా కూడా  జరిగింది. అమరావతి గ్రామాలను ఆనుకుని ఉన్న కృష్ణా నది ముంపు నివారణకు ఆనాడు ఏ విధమైన కరకట్ట లేక పోవడంతో కృష్ణానది, రాజధాని గ్రామాలలో ఒక టైన నవులూరు వరకు విస్తరించి ఉండేది. ఈ క్రమంలో నవులూరు లో గల నదీతీర ప్రాంతంగా ఉన్న కృష్ణానదిపై ఈవలి నుండి  ఆవలి ప్రాంతాలకు, నాటి అమరావతికి ముఖ్యంగా ఇటుకలతో పాటు మరి కొన్ని ఉత్పత్తులు జలరవాణా అయ్యేవి. వీటిని రవాణా చేసేందుకు నవులూరు వద్ద పెద్ద ఎత్తున నది ఒడ్డున నావలు ఉండేవి. గ్రామంలో నావల కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతమే నాటి నావలూరు, ఇప్ప‌టి నవు లూరు..ఇక ఉండవల్లి విషయానికి వస్తే, ఆ గ్రామానికి ఉండవల్లి అనే పేరు ఎలా వచ్చింది అనే ఆధారాలు లభించలేదు. కానీ అమరావతి ప్రాంతంలో ఎర్రబాలెం గ్రామం నుండి ఉండవల్లి గ్రామం వరకు సుమా రు నాలు గైదు కిలోమీటర్లు పొడవున ఓ కొండ ఉంది. ఈ కొండ తూర్పు దిశ ప్రాంతమే ఉండవల్లి గ్రామం. ఇక్కడే దక్షిణ భారతంలో మొట్ట మొదటి గృహాల నిర్మాణం జరిగింది. అవే ఉండవల్లి గృహాలు. ఇక ఈ కొండ పై క్రీ.పూ. భౌద్ధ బిక్షవులు స్వతంత్ర నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోగా ఈ కొండపై వారి జీవనా నికి గుర్తు గా కొన్ని నిర్మాణాలు కోనేరు,పెద్ద పెద్ద గోడల నిర్మాణాలు,వ్యవసాయం చేసిన ఆధారాలు వంటి వి ఇప్పు డు శిథిలావస్థలో ఉన్నాయి. ఇక  ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా పిలువబడుతున్న పూర్ణ కుంభం (పూర్ణ ఘట్టం) అనే దానిని రాష్ట్ర ప్రభు త్వా లు గుర్తించాయి. ఈ పూర్ణ కుంభం పుట్టుక అమరావతి.  నాటి శాత వాహనులు పాలనలో  అమరావతి పాడిపంటలు, ధన-ధాన్యాలతో దేదీప్య మానంగా వెలిగి పోతున్నందుకు గుర్తుగా అమరావతి ప్రాంతానికి చెందిన విధుకుడు అనే చర్మకారుడు అమరావతి ఎల్లకాలం ఇలాగే ఉండాలి అని శాతవాహన రాజులను అభినందిస్తూ పాడి పంటలు, ధన-ధాన్య రాశులు, పసుపు-కుంకుమ పూలు అలాగే శుభాలు గుర్తుగా కొట్టే కొబ్బరికాయ వంటి వస్తువులను ఓ పాత్రలో అమర్చిన పూర్ణ ఘట్టాన్ని బహుకరించారు.  ఇక ఈ చిహ్నాన్ని అమరావతి భౌద్ధ స్థూపాలలో ఏర్పాటు చేయాలని కోరటంతో నాడు అక్కడ భౌద్ధ స్థూపాల్లో ఈ చిహ్నం చేర్చారు. ఇక అమరావతి రాజ్యం మొత్తం ప్రధాన నిర్మాణాల్లో, ప్రముఖ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వచ్చింది.పూర్వం నుండి వస్తున్న ఆ విధానాన్ని అమరావతిని ఎవరు పాలించినా ఆ పూర్ణ ఘట్టాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కాలానుగుణంగా నేటి అమరావతి గ్రామమైన ఉండవల్లి గృహల్లో ఇక్ష్వాకులు కూడా వారి కాలానికి ముందే చెక్కిన‌ ఉండవల్లి గృహల్లో కూడా ఈ పూర్ణ కుంభాన్ని చెక్కారు. ఈ చిహ్నమే మన రాష్ట్ర చిహ్నంగా ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి ఉండవల్లి అనే పేరుకు కూడా చరిత్ర నుండి ఉద్భ వించింద‌ని చెప్పాలి.మరో రాజధాని గ్రామం నిడమర్రు.  ఈ గ్రామంలో కూడా కొన్నేళ్ళ క్రితం కొన్ని చారిత్రక ఆధారాలు వెలుగు లోకి వచ్చాయి. పూర్వం అమరావతి రాజధానిగా ఉన్న వేళ కొందరు రాజ వంశీకులు నిడమర్రు, కురగల్లు గ్రామాలను పాలించారు. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో నిడమర్రు గ్రామం అమరావతిలో  బ్రాహ్మణ అగ్రహారంగా ఉండేదని గ్రామ పొలాల్లో, పొలిమేరల్లో బ్రాహ్మణులు పూజించే దేవుడు-దేవతా విగ్రహాల వెలుగు చూసిన ఘటన ద్వారా తెలుస్తుంది. నాటి ధాన్యకటకం ఆధీనంలో ఉండి రాచరిక పాలన జరిగిన వేళ నుండి మరి కొన్ని గ్రామాల పేర్ల ఆధారాలు లభించక పోయిన దేవతల నగరం అమరావతి అయితే మరో దేవతల గ్రామంగా వైకుంఠంపురం నేటికి ప్రాచుర్యం కలిగి ఉంది. పూర్వం దేవతలు కృష్ణా నది ఉత్తరాయణం పారే ప్రాంతంలో స్నానం చేసే వారని చెపుతున్న పురాణ గ్రం ధాలకు నిలువెత్తు సాక్ష్యంగా అమరావతిలో అంతర్భాగంగా కృష్ణానది ఉత్తర దిక్కుకు పారుతూ కనిపించే వైకుంఠపురం కూడా ఓ చారిత్రక గ్రామంగా మనల్ని ఆకట్టుకుంటుంది.  ఆలాగే అమరావతికి అతి సమీ పంలో ఉన్నది నరుకుళ్ల పాడు. నాడు అమరావతిని పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన రా జ్యంలో కరువు ఏర్పడిన వేళ అక్కడ నివాసం ఉన్న చెంచులు అమరావతి రాజ్యంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వేళ సుమారు 150 మంది చెంచులను వాసిరెడ్డి వారు ఎక్కడైతే వారిని నరికి ప్రజలకు రక్షణ కల్పించారో ఆ ప్రాంతాన్ని  నరుకుళ్ల పాడుగా పిలుస్తున్నారు. వెంకటాద్రి వారు పాలనలో జరిగిన ఈ ఘటనకు గుర్తుగా ఏర్పడిన గ్రామం నరకు ళ్ళ పాడు చరిత్ర చెప్పే సాక్ష్యానికి గుర్తుగా ఉంది.

Related Posts