తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన ఆలయాలు
హైదరాబాద్/అమరావతి
సూర్య గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతబడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు సరిగ్గా ఉదయం 8 గంటల తర్వాత మూతపడ్డాయి. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు 12 గంటల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంతో పాటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్ కూడా మూతపడ్డాయి. ఈ సూర్యగ్రహణం కారణంగా 18 గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు రద్దు చేశారు. పుణ్యహవచనం, ఆలయ శుద్ధి అనం తరం రాత్రి 9 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించ నున్నారు. టీటీడీ అనుబంధ ఆలయా లతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూతపడ్డాయి.
ఇంద్రకీలాద్రి పైను కనకదుర్గ ఆలయాన్ని మూసివేసారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు. ప్రధానాలయం తోపాటు ఉపాలయాలు మూసివేసారు. ఉదయం 11 గంలకు కవాట బంధనం చేసిన ఆలయ అర్చకులు, తిరిగి బుధవారం ఉదయం 6 గం.లకు అమ్మవారి ఆలయ ద్వారాలు తెరుస్తారు. బుధవారం ఉదయం దేవతామూర్తులకు సన్నపనాభిషేకలు, మహానివేదన,నిర్వహించి మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిస్తారు. బుధవారం నిర్వహించే సుప్రభాత సేవ, ఖడ్గమాల అర్చన, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమము, రుద్ర హోమము, లక్షకుంకుమార్చన, శ్రీ చక్రనవర్చన, చండీ హోమము,శాంతి కల్యాణము మొదలైన సేవలన్నీ రద్దు అయ్యాయి.