YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడ మార్కెట్లో కొత్త కోడి

బెజవాడ మార్కెట్లో కొత్త కోడి

కడప, అక్టోబరు  26,
బెజవాడ మార్కెట్లో కొత్త కోడి కూస్తోంది‌‌.‌. మాంసాహార భోజన ప్రియులకి విందు చేయడానికి కొత్త కలర్ కోడి మార్కెట్లోకి వచ్చింది‌. ఈ కోడిలో కొలెస్ట్రాల్ తక్కువ… రుచి, ఆరోగ్యం ఎక్కువ అని చెబుతున్నారు.. చిన్నారుల నుంచీ పెద్దల దాకా అందరికీ కావల్సిన పోషకాలున్నాయట… ఆ కోళ్ళను అమ్మడానికి ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసాడు… అసలు ఆ కోడి ఎక్కడ‌.. దాని గొప్పదనం ఏంటి‌… ఆ కోడి కధేంటి‌.. ఆ కోడిలో అంతేముంది‌‌‌… తెలుసుకుందాం పదండి.  మాంసాహార ప్రియులు ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. మటన్, చికెన్, చేపలు, రొయ్యలను ఇష్టంగా భుజిస్తారు. నాటు కోడి, బ్రాయిలర్, పెద్ద బ్రాయిలర్  కోళ్ల మాంసం మార్కెట్లో లభిస్తోంది. ఇప్పుడు కడక్ నాథ్ కోడి మాంసం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ధర ఎక్కువైనా మంచి పోషక విలువలతోపాటు రుచికరమైన ఈ మాంసాన్ని భుజించేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు.కడక్ నాథ్ రకానికి చెందిన కోళ్లు మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. సాధారణంగా నాటుకోళ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. కడక్ నాథ్ కోళ్లకు ఈకలే కాదు శరీరం మొత్తం నలుపు రంగులోనే ఉంటుంది. మెలనిన్ అనే హార్మోన్ కారణంగా ఈ కోళ్లు నలుపు రంగులో ఉంటాయి. సాధారణ కోడి మాంసంతో పోలిస్తే కడక్ నాథ్ మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. రుచి మాత్రం బాగుంటుంది. ఈ కారణంగా మాంసాహార ప్రియులు ఈ కోళ్లను ఇష్టపడుతున్నారు. ఈ కోళ్ల మాంసానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కిలో మాంసం ధర రూ. 1000 పైనే. అంటే మటన్ ధర కంటే కడక్ నాథ్ కోడి మాంసం ధరే ఎక్కువ అన్నమాట. ధర ఎక్కువైనా మార్కెట్లో కడర్నాథ్ మాంసానికి అధిక డిమాండ్ ఉండటానికి కారణం పోషక విలువలే. కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కోళ్లకు వ్యాధి నిరోదక శక్తి ఎక్కువ.  సాధారణంగా కోళ్లలో కనిపించే వ్యాధులు వీటి దరికి చేరవు.కడక్ నాథ్ జాతి కోళ్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ రంగానికి మరింత చేయూత ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆరుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కుదేలైన కోళ్ల ఫారాలను తెరిచి కడక్ నాథ్  కోళ్ల పెంపకం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ జాతి కోడి పిల్లలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు  కడక్ నాథ్ కోడి పిల్లలను ఇచ్చే దిశగా సమాలోచన చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా కడక్ నాథ్ కోళ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పశువర్దకశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.విజయవాడలో ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి… ఈ కడక్ నాథ్ కోడి అమ్మకాలపై దృష్టి పెట్టాడు… ఈ కోళ్ల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలు… సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో జీతం కంటే ఎక్కువ అని చెబుతున్నాడు.. అంతేనా.. ప్రకృతి ఒడిలో కోళ్ళ పెంపకం తో జీవనం సాగిస్తున్నాడు… అలాగే మరి కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.

Related Posts