YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బొగ్గు దిగుమతితో ఆర్థిక భారం

బొగ్గు దిగుమతితో ఆర్థిక భారం

నెల్లూరు, అక్టోబరు 26, 
ఫ్రభుత్వరంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాయి. ఆదాయాల్లోని ఉన్న సంస్థలను ఏదొక సాకు చూపించి కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ (ఎపి జెన్‌కో)ను ప్రయివేటీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం బిడ్లను ఈ నెల 20న ఆహ్వానించనుంది. టెండర్ల పత్రాలను ఆన్‌లైన్లో పెట్టనుంది. బిడ్లు వేయడానికి 21 రోజులు గడువు ఇచ్చింది. నవంబర్‌ చివరికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమవుతోంది. రూ.20 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ప్రయివేటు వ్యక్తులకు 25 ఏళ్లు లీజుకు ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 21న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా అదే రోజు నుంచి ఎపి జెన్‌కో కార్మికులు పోరుబాట పడ్టారు. వీరి పోరాటానికి సిపిఎం, సిపిఐ, టిడిపి, కాంగ్రెస్‌, జనసేన, సిపిఐ (ఎంఎల్‌) మద్దతు ఇస్తున్నాయి. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా విద్యుదుత్పత్తికి ఆటంకం కలగకుండా కార్మికులు చేస్తోన్న పోరాటానికి ప్రజల మనన్నలూ లభిస్తున్నాయి. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఏదొక రూపంలో వీరు ఆందోళన నిర్వహిస్తున్నారు. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ (ఎపి జెన్‌కో)కు 2015లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించించారు. ఒక్కో యూనిట్‌ 800 మెగావాల్ట్‌ సామర్థ్యంలో మూడు యూనిట్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న ఒక ప్రాజెక్టులో 500 యూనిట్లు, మరో ప్రాజెక్టులో 490 యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. లాభాల్లో నడుస్తోంది. అయితే, నష్టాలు వస్తున్న పేరుతో ఈ ప్రాజెక్టును ప్రైవేట్‌ వారికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందకృష్ణపట్నంలోని ఎపి జెన్‌కోకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. నేలటూరులో ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యాన నిర్వహిస్తోన్న గాయత్రి థర్మల్‌ ప్రాజెక్టులోనూ, ఎన్‌సిపి ధర్మల్‌ ప్రాజెక్టులోనూ ఒక యూనిట్‌ విద్యుదుత్పత్తికి రూ.2.60 ఖర్చవుతోంది. బొగ్గును విదేశాల నుంచి అధిక ధరలకు బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఎపి జెన్‌కోలో ఒక్క యూనిట్‌ విద్యుదుత్పత్తికి రూ.3.90 ఖర్చు చేయాల్సి వస్తోంది. బొగ్గు దిగుమతులు, ఇతర అంశాల్లో ప్రాజెక్టులకు నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం చెబుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 1200 మంది అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, 338 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 27 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానిది. ప్రైవేటీకరణను ఆ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల కృష్ణపట్నం పోర్టును అదానీకి కట్టబెట్టింది.

Related Posts