YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ చట్టంలో మార్పులు...

ఆ చట్టంలో మార్పులు...

న్యూఢిల్లీ,  నవంబర్ 1, 
దేశ ద్రోహ చట్టంలో మార్పులకు కేంద్రం ఓకే చెప్పింది. ఇండియ్ పీనల్ కోడ్ సెక్షన్ 124(ఎ)లో వచ్చే వర్షాకాల సమావేశాల్లో మార్పులు తేవాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. దేశద్రోహ నేరం సెక్షన్ 124(ఎ) చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పీటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం (అక్టోబర్ 31) విచారణ జరిగింది. అంతకు ముందే.. విచారణలో భాగంగా కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే.ఆ నోటీసులపై కేంద్రం మార్పులు చయనున్నట్లు పేర్కొంటూ వివరణ  ఇచ్చింది. దీంతో కేసు విచారణ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. కాగా దేశ ద్రోహ చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకూ సదరు చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.అలాగే ఈ కేసు కింద అరెస్టయిన వారు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొంది. అటువంటి బెయిలు పిటిషన్లను కోర్టులు సాధ్యమైనంత త్వరగా విచారించి డిస్పోజ్ చేయాలని మాజీ సీజేఐ ఎన్వీరమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 124(ఎ)ను పున: పరిశీలించేందుకు కేంద్రానికి అనుమతించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పని పూర్తయ్యే వరకూ ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయరాదని    అప్పట్లోనే విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.  

Related Posts