ముంబై, నవంబర్1,
ప్రతి నెలా మొదటి తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు ఎన్నో అంశాలలో ధరలలో మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు గ్యాస్ బండ రేటు తగ్గొచ్చు, కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. కానీ తాజాగాఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎల్‌పీజీ 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 115.50 మేర తగ్గింది. మంగళవారం నుంచే తగ్గిన ధరలు అమలులోకి వచ్చేసిందికొత్త నెల ప్రారంభంతో ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటు ఇతరత్రా ధరలు, నియమాలు మారుతుంటాయి. ఈ నెల తొలిరోజే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెబుతూ 19 కేజీల సిలిండర్ పై రూ.115.50 మేర తగ్గించారు. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మొండిచెయ్యి చూపారు. గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర నిలకడగా ఉంది.
లేటెస్ట్ రేట్లు ఇలా..
ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అక్టోబర్ 31 వరకు రూ. 1859గా ఉండేది. మారిన ధరలతో నేటి నుంచి రూ. 1744కు దేశ రాజధానిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం రూ.1053 వద్ద స్థిరంగా ఉంది.
- డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.1,105 గా ఉంది. నవంబర్ నెలకుగానూ ధరలో ఏ మార్పులు చేయలేదు. హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు అమలుకానుంది. అక్టోబర్ 31 రూ.2102 ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1987కు దిగొచ్చింది. 5 కేజీల సిలిండర్ ధర రూ.414.
- కోల్‌కతాలో రూ. 1995గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1846కు తగ్గింది.
- ముంబైలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు రూ. 1811 నుంచి రూ. 1696కు దిగొచ్చింది.
- చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2009.50 నుంచి తాజా తగ్గింపులో రూ.1893 అయింది.
నెలా ఒకటో తేదీ నుంచి కొత్త ధరలు
వంట గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు ప్రతి నెలా మొదటి తేదీన మారుతుంటాయి. గ్యాస్ బండ రేటు కొన్నిసార్లు తగ్గొచ్చు, మరి కొన్నిసార్లు పెరగొచ్చు. ఈసారి కూడా, నవంబర్ 1న గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ రెండింటికీ కొత్త ధరలను ప్రకటిస్తారు. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నందున, ఈసారి LPG సిలిండర్ల ధరలను పెంచే అవకాశం ఉందని భావించారు. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధర యథాతథంగా ఉండగా, 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ.115.50 మేర తగ్గించారు.