తిరుపతి, నవంబర్ 2,
ఓటుకు రూ. ఐదు వేలు పంచి గెలిచామని .. ఇప్పుడు అప్పుల వాళ్లకు వడ్డీలు చెల్లించేలా కూడా మున్సిపల్ పనులు, కాంట్రాక్టులు ఇవ్వడం లేదని ఓ కౌన్సిలర్ భర్త.. కౌన్సిల్ భేటీలోనే కమిషనర్ ముందే వాపోయారు. ఆ కమిషనర్.. అదేమిటయ్యా.. అలా అంటావు.. మొన్ననే కదా.. రూ. ఎనిమిది వందల విలవైన పనులు ఇచ్చాను. ఆ డబ్బులు కూడా నేనే ఇచ్చాను కదా అని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం విని కౌన్సిలర్ భర్త గుండె మరింత రగిలిపోయింది. కానీ ఏం చేయగలరు ? ఆ బాధ ఆయనొక్కడిదే కాదు.. ఆ కౌన్సిల్ భేటీలో ఉన్న కౌన్సిలర్లందరిదీ. ఇంతకీ అదేం మున్సిపాలిటీ అంటే.. కుప్పం !టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవ్గం మున్సిపాలిటీలో వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. అంతకు ముందు పంచాయతీగా ఉండేది. మున్సిపాలిటీగా చేశారు. కానీ మున్సిపల్ సమావేశం నిర్వహించేందుకు హాల్ లేదు. అందుకే ఓ చిన్న రూమ్‌లో మీటింగ్ ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు వచ్చారు. దాదాపు మూడేళ్లు గడుస్తున్న తమ తమ వార్డుల్లో ఇప్పటి వరకూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేక పోతున్నాంమని, తమకు వేంటనే అభివృద్ధి కార్యక్రమాలకు నగదు విడుదల చేయాలని కొందరు కౌన్సిలర్లు ప్రస్తావించారు.. ఇంతలో ఒక్కసారిగా పైకి లేచిన 17వ వార్డు వైసీపి కౌన్సిలర్ దేవకీ భర్త రంగయ్య కోపంతో ఊగిపోతూ తాము గెలిచినప్పటి నుండి నేటి వరకూ ఒక్క అభివృద్ధి పనులు చేసుకోలేక పోతున్నాంమని, ప్రజల ముందు ఎలా మొఖం చూపించాలని చెప్తూ, మున్సిపల్ కమీషనర్ తో తాము మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చి గెలిచాంమని, కనీసం చిన్న చిన్న పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని, కనీసం చిన్న చిన్న పనులకు కూడా బిల్లులు ఇవ్వారా అంటూ సాక్షాత్తు కుప్పం కమీషనర్ నే వైసీపి నేత రంగయ్య నికదీశాడు. ప్రభుత్వం నుండి అభివృద్ధి పనులకు గానూ ప్రతి నెల ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తోందని కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని ఉపయోగించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. దీంతో కొందరు కౌన్సిలర్లు కమిషనర్‌తో వాగ్వాదం దిగారు. నాలుగు ఓట్లు కొనేందుకు రూ. ఇరవై వేలు ఖర్చు పెట్టామని..ఇప్పుడు నెలకు రూ. ఇరవై వేలు ప్రభుత్వం ఇస్తోందని చెప్పడమేమిటనేది వారి వాదన. మున్సిపల్ వైస్ చైర్మన్ అయితే ఎన్నికల్లో గెలిచేందుకు తాము అప్పులు తెచ్చామని.. అప్పులు ఇచ్చిన వారి దగ్గరకు వెళ్తే చెప్పుతో కొడతారని ఆవేధన వ్యక్తం చేశారు. వైసీపి నేత స్వయంగా మున్సిపల్ కమీషనర్ తో ఓటుకు ఐదు వేలు ఇచ్చి గెలిచాంమని చెప్పిన మాటలు ఇప్పడు తీవ్ర దుమారం రేపుతుంది. కుప్పం మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశానికి మహిళా కౌన్సిలర్లు ఒక్కరు కూడా హాజరుకాలేదు. వారి భర్తలే హాజరయ్యారు. ఓటుకు రూ. ఐదు వేలు ఇచ్చి గెలిచామని చెప్పుకున్న రంగయ్య కూడా కౌన్సిలర్ కాదు. ఆయన భార్య కౌన్సిలర్. నేరుగా కౌన్సిల్ సమావేశంలోకి వారని ఆహ్వానించడం.... చట్ట విరుద్ధం. కానీ కుప్పం మున్సిపల్ కమిషనర్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. భార్యలకు బదులుగా భర్తలనే కౌన్సిలర్లుగా గుర్తించి సమావేశానికి రానిచ్చారు. ఇప్పుడు వారు ఎలా బయటపెట్టారో వారి గుట్టు బయట పెట్టేసుకున్నారు.