చంద్రబాబు నాయుడు జీవితం అంత కులాల మధ్య విధ్వంసలు సృష్టించడమే. ప్రస్తుతం అర్చకుల జీవితాలతో ముఖ్యమంత్రి అడుకుంటున్నారని మాజీ టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశం లో అయన మాట్లాడారు. వేంకటేశ్వరుని క్షేత్రంలో రాజకీయాలు చేస్తున్నారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై అధికారులలొ ఎందుకు అలజడి మొదలైంది. శ్రీవారి పోటులో జరిగినటువంటి తవ్వకాలపై టీటీడీ సమాధానం ఏంటని అయన నిలదీసారు. శ్రీవారి తిరువాభారణలు బాధ్యత ఎవరి చేతిలో ఉంది. రమణ దీక్షితులు అన్నటుగా శ్రీవారి హారంలో పింక్ డైమండ్ ఏమైంది...దీనిపై విచారణ జరపాలని అయన డిమాండ్ చేసారు. టీటీడీ లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఒక ధార్మిక సంస్థపై ప్రభుత్వ జోక్యం ఎందుకని అయన ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా అర్చకుల 65 సంవత్సరాలు వయో పరిమితి , ఇప్పుడెందుకు గుర్తొచ్చింది. వారసత్వంగా వస్తున్న అర్చకులపై రాజకీయ క్రీడా ఆడుతున్నారని విమర్శించారు. అనాదిగా వస్తున్న ఆలయ ఆచారాలను కొత్తగా వచ్చిన ధర్మకర్తల మండలి అపవిత్రం చేసిందని అన్నారు.