- మనకు 26 జనవరి అత్యంత ప్రాముఖ్యమైన రోజు...
ఒక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినమును స్వాతంత్ర్య దినం అంటారు.. మన దేశానికి ఆగష్టు 15 న స్వాతంత్రము వచ్చినది.
స్వాతంత్ర్యం రాగానే వెంటనే ఒక రాజ్యం పాలనలోకి రాలేదు దానికి కొన్ని కట్టు బాట్లు నడవడికలు ఏర్పరచుకోవాలి... ఆతర్వాతే పాలన ప్రారంభిస్తుంది.. దానినే రాజ్యాంగం అంటారు.. ఇలా మన దేశ రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని 26 జనవరి 1950నుండి అమలులోకి వచ్చింది.. అందుకే అప్పటినుండి సర్వసత్తాక స్వతంత్ర్య భారత్ అయిందన్న మాట..
1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్ రాజ్యాంగం..
మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.
నవంబరు-26 ఉండగా ఎందుకు జనవరి 26 న రిపబ్లిక్ డే జరుపుకుంటారు?
ఇలాంటి ప్రశ్నలకు ఈ తరం విద్యార్ధులు, యువత తెలుసుకోవాల్సిన అంశాలు. 1947ఆగష్టు 15న అర్ధరాత్రి బ్రిటీషు పాలకుల నుండి భారత దేశం స్వాతంత్రం పొందినది. ఆతర్వాత భారత ప్రభుత్వం నడుపుకోవడానికి అవసరమైన రాజ్యాంగం రూపొందించుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో వేసిన కమిటి 2సంవత్సరాల 11నెలల 18రోజుల సమయం తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ కమిటి తయారు చేసిన ముసాయిదాను 1949 నవంబర్
26న భారత పార్లమెంటు ఆమోదించింది. గణతంత్ర దేశంగా ప్రకటించారు. జాతి సమాజాలు, బహుళ మతాలు, ప్రాంతీయ తెగలు తీసుకొని 1935నాటికి అమలులో ఉన్న రాజ్యాంగం పరిగణనలోకి తీసుకుని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. 1930లో సంపూర్ణ స్వాతంత్ర నినాద వేడుకల సందర్భంగా జనవరి నెల ఆఖరి ఆదివారం (జనవరి 26న) లాహోరులోని రావినది ఒడ్డున జాతీయ జెండా ఆవిష్కరించారు. అందుకే గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. పార్లమెంటులో రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా, రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు.
కానీ రాజ్యాంగం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1930 జనవరి 26న మొదటిసారి పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీంతో ఆ తేదీకి ఉన్న చారిత్రక స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు.
అందుకే మనకు 26 జనవరి అత్యంత ప్రాముఖ్యమైన రోజు...
ఇన్ని ప్రత్యేకతలు మన రాజ్యాంగానికి ఉన్నాయి కాబట్టి.. మన దేశం .... స్వతంత్ర భారత దేశం ... సర్వసత్తాక, అతి పెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించగలిగింది...
మనం ఇంత స్వతంత్రంగా జీవించగలగుతున్నందుకు భారతీయులమైనందుకు తప్పని సరిగా గర్వపడాలి!!
భారత్ మాతాకీ జై!!
.