YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

26 ల‌క్ష‌ల‌కు పైగా భార‌త్ ఖాతాల‌ను నిషేధించిన వాట్సాప్‌

26 ల‌క్ష‌ల‌కు పైగా భార‌త్ ఖాతాల‌ను నిషేధించిన వాట్సాప్‌

న్యూఢిల్లీ నవంబర్ 3
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ సెప్టెంబ‌ర్‌లో 26 ల‌క్ష‌ల‌కు పైగా భార‌త్ ఖాతాల‌ను నిషేధించింది. ఐటీ నిబంధ‌న‌లు 2021, 4(1)(డి) నిబంధ‌న‌ల కింద ఈ ఖాతాల‌ను నిషేధించిన‌ట్టు వాట్సాప్ తెలిపింది. జులైతో పోలిస్తే సెప్టెంబ‌ర్‌లో నిషేధించిన వాట్సాప్ ఖాతాల సంఖ్య 3 ల‌క్ష‌లు అధికం. భార‌త యూజ‌ర్ల నుంచి అందిన పిర్యాదుల ఆధారంగా ఈ ఖాతాల‌ను నిషేధించిన‌ట్టు వాట్సాప్ వెల్ల‌డించింది.సెప్టెంబ‌ర్ 1 నుంచి సెప్టెంబ‌ర్ 30 మ‌ధ్య మొత్తం 26,85,000 ఖాతాల‌ను వాట్సాప్ బ్యాన్ చేసింది. స్పామ్‌, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌, ఇత‌ర కార‌ణాల‌తో ఈ ఖాతాల‌ను నిషేధించిన‌ట్టు కంపెనీ పేర్కొంది. త‌మ ప్లాట్‌ఫాంపై యూజ‌ర్ల భ‌ద్ర‌త‌, గోప్య‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తామ‌ని తాజా నివేదిక‌లో వాట్సాప్ స్ప‌ష్టం చేసింది.త‌మ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సిస్ట‌మ్ అబ్యూజ్‌ను దీటుగా ఎదుర్కొనేలా రూపొందింద‌ని తెలిపింది. యూజ‌ర్ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు త‌మ ఇంజ‌నీర్ల టీం, డేటా సైంటిస్టులు, అన‌లిస్టులు, రీసెర్చ‌ర్స్‌, చ‌ట్ట నిపుణులు, టెక్నాల‌జీ విభాగాల‌కు చెందిన వారు అంకిత భావంతో సేవ‌లందిస్తార‌ని పేర్కొంది.

Related Posts