YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రష్యాకు మరో ఎదురుదెబ్బ..

రష్యాకు మరో ఎదురుదెబ్బ..

మాస్కో నవంబర్ 3
రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ మిలిటరీ దాడిలో వెయ్యి మంది రష్యా సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత రష్యా మరోసారి ఇంత పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది. సైన్యంలోకి కొత్తగా రిక్రూట్‌ చేసుకున్న సైనికులను సరిహద్దుల వద్దకు రష్యా తరలించింది. అయితే కనీస ఆయుధాలు కూడా లేని రష్యా సైనికులపై ఉక్రెయిన్‌ దళాలు దాడి చేశాయి. దీంతో గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.మరోవైపు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి గోధుమల రవాణా కోసం ఐక్యరాజ్య సమితి (ఐరాస)తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా బ్రేక్‌ చేసింది. గోధుమలు ఎగుమతి చేసే కారిడార్‌ను రష్యాపై దాడుల కోసం ఉక్రెయిన్‌ వినియోగిస్తున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యూఎన్‌, టర్కీతో చేసుకున్న ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు.

Related Posts