YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నమూనా ఎన్నికల షెడ్యూల్ జారీ 12,734 పంచాయతీలకు ఎన్నికలు 1.30 లక్షల పోలింగ్ కేంద్రాలు

నమూనా ఎన్నికల షెడ్యూల్ జారీ 12,734 పంచాయతీలకు ఎన్నికలు 1.30 లక్షల పోలింగ్ కేంద్రాలు

గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ ఈసీ) ఆదేశించింది. ప్రస్తుత పాలకమండళ్ల గడువు ఆగస్టు ఒకటిన ముగియనుండటంతో ఎన్నికలు ఆ లోగానే జరగాలని, వెంటనే కొత్త పాలక మండళ్లు కొలువు తీరాలని సూచించింది. ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించింది. 2 లేదా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఎన్నికల షెడ్యూల్ను కూడా జారీ చేసింది. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అథారిటీ(అధికారి)గా పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా ఎన్నికల అథారిటీగా జిల్లాల కలెక్టర్లు వ్వహరిస్తారని ఎస్ఈసీ ప్రకటించింది. పంచాయతీలకు ఎన్నికలు ఒక విడతలో నిర్వహిస్తే కనీసం 15 రోజులు, రెండు విడతల్లో నిర్వహిస్తే 19 రోజులు, మూడు విడతల్లో నిర్వహిస్తే 23 రోజుల నిడివి అవసరమని ఎస్ఈసీ పేర్కొన్నది. షెడ్యూల్ను జూన్ ఒకటిన ప్రారంభిస్తే ఇలా ఉంటుందంటూ నమూనా షెడ్యూల్ను వెలువరించింది. ఈ నమూనా షెడ్యూల్ను చూసి ఎన్నికల షెడ్యూల్ జారీ అయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరికొన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో జూన్ రెండో వారంలో అధికారిక షెడ్యూల్ వెలువడుతుందని అధికారులు అంటున్నారు.

పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ ఆదేశాలు..

పోలింగ్ కేంద్రాల సమీపంలోకి ఆయుధాలతో వెళ్లడం నిషేధం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు తదితర ప్రముఖుల భద్రతకు నియమితులైన సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తారు. మైక్రో అబ్జర్వర్లను పనిచేస్తున్న మండలంలో గానీ, సొంత మండలంలో గానీ నియమించొద్దు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట మైక్రో అబ్జర్వర్లను నియమించాలి. ఒకే ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలన్నింటికీ కలిపి ఒక్కరినే మైక్రో అబ్జర్వరుగా నియమించాలి.  రూ.5 డిపాజిట్తో ఓటర్లను పోలింగ్ ఏజెంట్లు చాలెంజ్ చేయొచ్చు.  టెండరు ఓట్లు 0.1% కు మించి పోలైతే రీ పోలింగ్కు వీలుంటుంది.  ఒకే వ్యక్తి ఒక రి కంటే ఎక్కువ మందికి సహాయకుడిగా వచ్చేందుకు వీల్లేదు. పోలింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారు సహాయకుడిగా వచ్చేందుకు వీల్లేదు. కౌంటింగ్ ముగియగానే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.  ప్రతి బ్యాలెట్పై వెనుక భాగంలో పోలింగ్ కేంద్రం కోడ్ ఉంటుంది.  పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ను తెరవాలి.  ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో లేనివారు ఆధార్ సహా 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా వెంట తెచ్చుకొని ఓటు వేయొచ్చు.  నామినేషన్ పత్రాలపై ఇద్దరు సాక్షుల సంతకాలు చేయించాలి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే శిక్షార్హులని ఎన్నికల సంఘం పేర్కోంది.

Related Posts