విజయవాడ
బీసీ నేత అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్ట్ దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. తుగ్లక్ సీఎం తప్పుల్ని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగల్లా అర్దరాత్రు లు టీడీపీ నేతల ఇళ్ళల్లో దూరి అరాచకాలు చేస్తున్నారు. టీడీపీ కి అండగా ఉన్నారనే బీసీ నేతలపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపులు చేస్తున్నారు. 1947 కి ముందు జైళ్లన్నీ స్వాతంత్ర్య సమరయోధులతో నిండినట్టు వైసీపీ పాలనలో జైళ్లన్నీ టీడీపీ నేతలతో నిండిపోతున్నాయి. ఎల్లకాలం జగన్ రెడ్డి అరాచక పాలన సాగదు. ప్రజలు తిరగపడితే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. అయ్యన్నపాత్రుడు ని వెంటనే విడుదల చేయాలని అయన డిమాండ్ చేసారు.
అయ్యన్న ఆరెస్టు అన్యాయం
అయ్యన్నపాత్రుడు, రాజేష్ ల అక్రమ అరెస్టును ఖండిస్తూ, వెంటనే విడుదల చేయాలని కోరుతూ గొల్లపూడి వన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసనకు దిగారు. దేవినేని మాట్లాడుతూ బీసీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టు అన్యాయం. తాగొచ్చి అయ్యన్న సతీమనిని దుర్భాషలాడుతారా.? అధికారంలోకి రావడానికి బీసీ జపం చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు బీసీల అణచివేత పనిగా పెట్టుకుని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు అయ్యన్నపాత్రుడు, రాజేష్ ల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. సీఐడీ అధికారులు సిగ్గువదిలి పనిచేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ స్వేచ్ఛాహక్కును హరిస్తున్నారు. మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ నేతల హత్యలు, అరెస్టులే ఎక్కువగా జరిగాయని అన్నారు.
దీన్ని బట్టి చూస్తే అర్థంకావడం లేదా..? బీసీ అనే పేరు వింటే జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష తనమో.? రాజకీయంగా బీసీ నేతలు ఎదగకూడదన్నదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం. బీసీలపై ఈ ముఖ్యమంత్రి పెడుతున్న అక్రమ కేసులకు ముగింపు పలకాలి. అయ్యన్నపాత్రుడు సతీమణి పట్ల తాగివచ్చిన సీఐడీ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. గోడలు దూకి అర్ధరాత్రి పూట అరెస్టులు చేసే సంస్కృతి ఏపీలో తప్ప ఏరాష్ట్రంలోనైనా ఉందా అని ప్రశ్నించారు.