YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ నవంబర్ 3
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని, మొదటి దశ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని ఈసీ గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం న్యూఢిల్లీలో ప్రకటించారు.ఈసీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను గత నెలలో ప్రకటించింది.డిసెంబర్ 8వతేదీన హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది.గుజరాత్‌ రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలోని 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్(77 స్థానాలను కైవసం చేసుకొని రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగనుంది.బీజేపీ నాయకులు గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది.

Related Posts