పులివెందుల
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన విషయంలో ఎంపి విజయ సాయిరెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. గురువారం పులివెందులలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ విశాఖ ప్రధాని పర్యటన విషయంలో విజయసాయి ప్రకటనలు ప్రజలను తికమక పెడుతున్నాయన్నారు. భారత ప్రధాని అధికారిక పర్యటన ఎపి ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాలని, కలెక్టర్ లు పర్యటన వివరాలు చెప్పాలని అయితే అంతా విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి పర్యటన విషయాలు ప్రకటన చేయడాన్ని సోమువీర్రాజు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి నిర్వహించిన సమీక్షను సోమువీర్రాజు తప్పుపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం గాలేరీ నగరి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రం లో రైల్వే పనులు త్వరితగతిన జరుగుతున్నాయి, రైల్వే విస్తరణ జరుగుతోందని ఇంతటి అభివృద్ది గత ప్రభుత్వాలు చేయలేక పోయాయన్నారు. రాయలసీమ అభివృద్దికి బిజెపి కట్టబడి ఉందని హామీ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గా తీసుకుని పనిచేస్తూంటే ,రాష్ట్రం లో రాయలసీమ అభివృద్దికి కుటుంబ పార్టీలు ఏం చేస్తున్నాయని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు హాని తలపడితే బిజెపి చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఇంటివద్ద కు వచ్చిన అపరిచిత వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలని తెలంగాణా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో మెక నైజ్డ్ యాంత్రీకరణకు కేంద్రం సహకరిస్తోందన్నారు. యూరియా సబ్సిడీ ఇస్తోంది .కేంద్రం సహకారం రాష్ట్రం తీసుకోవాలన్నారు. సోలార్ మొటార్ కి సబ్సిడీ కేంద్రంఇస్తోంది. ఇళ్ళకి కేంద్రం సబ్సిడీ ఇస్తూంటే రాష్ట్రం ఎందుకు నిర్మాణం చేయడం లేదు రాష్ట్రం ఎందుకు సబ్సిడీ ఇవ్వడంలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని ఎన్నికల ముందు చెప్పలేదన్నారు. కర్నూలు లో హైకోర్టు పెట్టాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు కేంద్ర న్యాయమంత్రి కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు. పులివెందుల నుండి కూడా అమరావతికి అదేవిధంగా అనంతపురం మీదుగా బెంగుళూరు కు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న విషయాన్ని సోముగుర్తు చేశారు. పారిశ్రామిక వాడలను నిర్మాణం చేయాలి అందువల్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు కారిడార్లను ప్రకటించారు అందుకు అనుగుణంగా పారిశ్రామిక అభివ్రుద్దికి నాంది పలుకుతున్నాం. కడపలో 8వేల ఎకరాలు కారిడార్ లో భాగంగా భూములు సేకరించడం జరుగుతోందని అన్నారు.