న్యూఢిల్లీ నవంబర్ 3
2000వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఎర్రకోటపై దాడికి పాల్పడినందుకు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధృవీకరించింది. ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం, దోషి రివ్యూ పిటిషన్‌నుతిరస్కరించింది. నేరం రుజువైనందున దోషి పిటిషన్ ను జస్టిస్ బేల ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఎర్రకోట దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా ముగ్గురు మరణించారు. ఎర్రకోట దాడిలో అరెస్టయిన ఎల్‌ఈటి ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్‌కు వేసిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు ధృవీకరించింది. 2011 ఆగస్టులో ఆయన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. అయితే 2016లో ఆయన రివ్యూ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2005నవంబర్ నెలలో ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు మరణశిక్ష విధించింది. ఇద్దరు రాజ్‌పుతానా రైఫిల్స్ జవాన్లు, ఒక పౌరుడిని చంపినందుకు ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు రూ.4.35 లక్షల జరిమానా విధించింది. 2007లో ఢిల్లీ హైకోర్టు ఆరిఫ్‌కు మరణశిక్షను సమర్థించింది.