ఒక జెట్ కేటగిరి ఉన్న అమిత్ షా కాన్వాయ్ పై దాడికి పాల్పడిన, రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోలేదు.అంత విధ్వంసం సృష్టించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకొకపోవడం పోలీసులు విఫలమయ్యారని బీజేపీ జాతీయ నాయకురాలు శాంత రెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. శాంతరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ టీడీపీ అవినీతిని సరిదిద్దుకోవలని నాలుగు సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. బీజేపీ నాయకులను విచారణకు పిలిచి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నీతిమాలిన రాజకీయాలు చేస్తుంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపలణపై విచారణ జరిపించాలని అమె డిమాండ్ చేసారు. కోట్లాది నిధులున్న టీటీడీలో అక్రమాలు జరిగాయంటున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలి. టీటీడీలో అక్రమాలపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆమె నిలదీసారు. మరో నేత కోలా ఆనంద్ మాట్లాడుతూ నాపై అక్రమ కేసులు పెట్టారు. అమిత్ షా కాన్వాయ్ పై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై ఎందులు చర్యలు తీసుకోలేదని అడిగారు. టీడీపీ పతనానికి సమయం దగ్గర పడిందని అన్నారు.