YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హిమాచల్ లో హిస్టరీ రీపీటా...

హిమాచల్ లో  హిస్టరీ రీపీటా...

సిమ్లా, నవంబర్ 4,
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా? లేక కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారా లేదా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు విశ్విసిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 35 గా ఉంది. రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీని పక్కన పెట్టి తాను పవర్ లోకి రావాలని భావిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక సెంటిమెంట్ ఉంది. ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి అధికారంలోకి ఇక్కడ రాదు. 1985 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. కాంగ్రెస్ ఈసారి తమదే అధికారం అన్న ధీమాలో ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తమకు కలసి వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా శ్రమిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే తాము లాభపడతామని బీజేపీ భావిస్తుంది కేసీఆర్ సంచలన కామెంట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ... అదే సమయంలో బీజేపీ అనుకూల ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చుకుంటే తమకు లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ విశ్వసిస్తుంది. ఇక పంజాబ్ లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తమను ఈసారి ప్రజలు ఆదరిస్తారని చెబుతోంది. అభ్యర్థుల ఎంపికలోనూ ఆ పార్టీ విభిన్నంగా వ్యవహరిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అంత బలంగా లేదు. బీజేపీ, కాంగ్రెస్ కు మాత్రమే బలం, బలంగం ఉండటంతో గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఒక్కసారి వేడెక్కిందనే చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నికపై ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వే చేయలేదు, ఇది బూటక వార్త. త్రిముఖ పోటీలో... గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకే పరిమితమయింది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఒకసారి గెలిపించిన ఓటర్లు మరోసారి ఆ పార్టీకి షాక్ ఇస్తారన్న హిస్టరీతో బీజేపీ తొలి నుంచి అప్రమత్తంగానే ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఆ పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దశల వారీగా జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్ లో ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల నాడి రాజకీయ విశ్లేషకుల అంచనాలకు సయితం అందకుండా ఉంది. మరి చివరకు ఎవరిది గెలుపు అన్నది చూడాల్సి ఉంది.

Related Posts