YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజస్థాన్ లో పవర్ పాలిట్రిక్స్

రాజస్థాన్ లో పవర్ పాలిట్రిక్స్

జైపూర్, నవంబర్ 4, 
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ పార్టీ హై కమాండ్ కు ఇచ్చిన ఝలక్ ఇంకా ఎవరూ మరచిపోలేదు.. పార్టీ అధ్యక్షపదవికి సోనియాగాంధీ ముందుగా ఎంపిక చేసింది తనకు అత్యంత విశ్వాసపాత్రుడని భావించిన అశోక్ గెహ్లాట్ నే.. ముఖ్యమంత్రి పదవి వదులుకుని అప్పటి అధినేత్రి ఆదేశాన్ని శిరసావహించడం ఇష్టం లేక గెహ్లాట్ ఏకంగా రాజస్థాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు వ్యూహానికి తెరతీశారు.తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఉండేందుకు తనను విశ్వసించిన అధినేత్రికా హాత్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ కోసం  నామినేషన్ వేయడానికి ముందు తదుపరి సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి తన వర్గానికి చెందిన నేతలెవరూ హాజరు కాకుండా వ్యూహం రచించారు. దీంతో సోనియా గెహ్లాట్ కు బదులుగా మల్లిఖార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ఆయన గెలిచారు. పార్టీ అధ్యక్షుడయ్యారు అది వేరే సంగతి. అయితే గెహ్లాట్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి పదిలంగా ఉండటమే కాకుండా.. ఆ పదవి కోసం పోటీలో ఉన్న సచిన్ పైలట్ కు ఇప్పట్లో అవకాశం లేకుండా పోయిందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు.అయితే ఆ కథ అక్కడితో ఆగిపోలేదని..ఇంకా ఉందని తాజా సంఘటనలతో రుజువైంది. గెహ్లాట్ తిరుగుబాటు వెనుక మోడీ ఉన్నారా అంటూ ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ప్రధాని మోడీ అవకాశం వచ్చినప్పుడల్లా.. అవసరం ఉన్నా లేకపోయినా అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పొగడ్తల్లో ముంచెత్తే వారు. తరువాత గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా మారి చివరకు పార్టీ వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే. గెహ్లాట్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగుర వేయడం వెనుక కూడా మోడీ ఉన్నారా అన్న అనుమానాలు తాజాగా రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలోనూ, ముఖ్యంగా సచిన్ పైలట్ లోనూ మాత్రం అవి అనుమానాలుగా కాక.. వాస్తవమేనన్న విశ్వాసంగా మారింది. అందుకు కారణమేమిటంటే.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ప్రధాని మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై రాజస్థాన్  కాంగ్రెస్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సచిన్ పైలట్ వర్గీయులు గెహ్లాట్ పై విమర్శల దాడి మొదలు పెట్టారు. గెహ్లాట్ ను మోడీ ప్రశంసించడాన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ప్రధాని గెహ్లాన్ పై ప్రశంసల వర్షం కురిపించడంపై స్పందించిన సచిన్ పైలట్.. ఈ పొగడ్తలను గులాం నబీ ఆజాద్ తన రాజ్యసభ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మోడీ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడంతో పోల్చారు. ఆ పొగడ్తల అనంతరం గులాం నబీ ఆజాద్ వైఖరి ఎలా మారిందో గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ గెహ్లాట్ ను ప్రశంసించడాన్ని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోరాదంటూ అధిష్ఠానానికి సూచన చేశారు. అంతే కాదు.. గత సెప్టెంబర్ లో రాజస్థాన్ సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించి గెహ్లాట్ కు అనుకూలంగా బల నిరూపణకు సిద్ధమైన ఎమ్మెల్యేలందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచిన్ పైలట్ వ్యాఖ్యలపై గెహ్లాట్  ఒకింత లౌక్యంగా స్పందించారు.  పైలట్ పై పరోక్షంగా చురకలు వేశారు.

Related Posts