గత మూడు సంవత్సరాలు అనంత అభివృద్ధి పై ఒక శ్వేతా పత్రాన్ని ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రస్తుతం 4 సంవత్సరాల అనంత అభివృద్ధి పై ప్రభాకర్ చౌదరి అని సంతకం చేసి శ్వేతా పత్రం విడుదల చేసాను. విడుదల చేసిన శ్వేతా పత్రంలో ఏవైనా అబద్దాలు ఉంటే ఎవరైనా కోర్టు కు వెళ్లొచ్చని అన్నారు. కొన్ని పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అనంతలో కబ్జా దారుల కోరల్లో ఉన్న ప్రభుత్వ భూములను,భవనాలను రక్షించానని అయన అన్నారు. అనంతపురం ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా.. కొందరు నేతలు విమర్శించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.