YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభం

భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభం

విజయనగరం, నవంబర్ 5, 
విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఉత్తరాంధ్రలో అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. అయితే బాధిత రైతులు పరిహారం విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే రైతులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం కొట్టివేసింది. దీంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మోక్షం కలిగినట్లైంది.త్వరలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తే పనులు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తుంది. అయితే హైకోర్టు అన్ని పిటిషన్లు కొట్టివేయడంతోపాటు మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తివేయడంతో మార్గం సుమగం కానుంది. ఇకపోతే దాదాపుగా 2,500 ఎకరాల విస్తీర్ణంలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం కానుంది. తొలుత టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పటికీ భూసేకరణ సమ్యసలు తలెత్తడంతో పనులు నిలిచిపోయాయి. అనంతరం పరిహారం విషయంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే విశాఖపట్నం ఎయిర్ పోర్టును కూడా భోగాపురానికి తరలించేందుకు నావికాదళం సైతం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీలో నౌకాదళం-ఏపీఏడీసీఎల్‌‌ల మధ్య ఎంవోయూ సైతం జరిగింది. అయితే విశాఖపట్టణం విమానాశ్రయానికి సంబంధించిన 170 ఎకరాల భూమిని నౌకాదళానికి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోతే ఇక యుద్ధ ప్రాతిపదికన రెండేళ్ల వ్యవధిలోనే భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇక త్వరలోనే జీఎంఆర్ సంస్థ విమాన నిర్మాణ పనులను ప్రారంభించనుంది.

Related Posts