YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వాయు కాలుష్య రాజకీయం

వాయు కాలుష్య రాజకీయం

న్యూఢిల్లీ, నవంబర్ 5,
ఉత్తరాధి రాష్ట్రాల ప్రజలు వాయు కాలుష్యం తో బెంబెలెత్తిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఈ వాయు కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. కాలుష్యం సమస్యను తగ్గించడానికి కొన్ని చోట్ల పాఠశాలలకు సెలవులిచ్చారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. వాయు కాలుష్య సమస్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్య సమస్య పరిష్కారంలో కేంద్రప్రభుత్వం విఫలమైందంటూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్గెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్మలు గుప్పిస్తున్నారు. ప్రతిగా పంజాబ్ లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడమే ఈ సమస్యకు కారణమని, అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసింది. రాజకీయ విమర్శల మధ్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో భాగమైన గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌, నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తగిన చర్యలు చేపట్టకుండా కేంద్రప్రభుత్వంపై నెపం వేసి రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తోందని బీజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో అన్ని భవన నిర్మాణ, కూల్చివేతలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేలు అందించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ నిర్ణయించారు. ఇక కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్‌ ఫ్రం హోమ్‌ పనిచే యాలని, ప్రైవేట్‌ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు 50 శాతం ఇంటి నుంచే పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మరోవైపు భవన నిర్మాణ కార్మికులుగా ఢిల్లీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, నకిలీ పేర్లను నమోదు చేసిందని, బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్రో విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల పేరుతో ఆ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ స్వాహా చేసిందని బిజెపి ఆరోపించింది . మరోవైపు శుక్రవారం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు దేశ రాజధానిలో వాయు కాలుష్యం అంశం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండొచ్చు. దీంతో ఈ సమస్యకు ఢిల్లీ, పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే కారణమని బీజేపీ చెప్తోంది. ఆప్ నాయకులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఏం భగవంత్ మాన్ తో కలిసి కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. వాయు కాలుష్య సమస్య ఉత్తరాది రాష్ట్రాల సమస్య అని, ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను దీనికి బాధ్యత చేయడం సరికాదన్నారు. ఒకరిని ఒకరు నిందించుకునే సమయం ఇది కాదన్నారు కేజ్రీవాల్.పెట్రోల్, డీజిల్ వాణిజ్య వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు, ఎసెన్షియల్స్, CNG వాహనాలు మినహా అన్ని పెట్రోల్, డీజిల్ ట్రక్కులు, లారీలతో పాటు భారీ వాణిజ్య వాహనాలకు ఢిల్లీలోకి అనుమతి లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ఈ సమస్య రాజకీయ దుమారాన్ని సైతం రేపుతోంది.

Related Posts