YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎక్సెల్లెన్సీ అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

ఎక్సెల్లెన్సీ అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

కేసీఆర్ కిట్ల పథకానికి అవార్డు రావడం పట్ల వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అవార్డులు దక్కడమే కాకుండ, దేశం, రాష్ట్రాలను ఆకర్షిస్తున్నదని మంత్రి అన్నారు. అనేకమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు సీఎం లు సైతం అభినందించారని అన్నారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ కు కూడా అవార్డులు వచ్చాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం ప్రకారం చేయడం,  సీఎం గారి ఆలోచనల మేరకు నడచుకోవడం వల్ల సాధ్యం అయిందన్నారు. అందు వల్ల మంత్రి లక్ష్మారెడ్డి సీఎం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఉన్నతాధికారులు, డాక్టర్లు, నర్సులు సిబ్బంది మంచి పనితీరు వల్ల సాధ్యం అయిందన్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను పెంచిందని, మరింత పటిష్ఠంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని అమలు చేసి మరింత ఎక్కువ ప్రజాభిమానాన్ని చూరగొంటామని మంత్రి చెప్పారు.జూన్ 3వ తేదీ 2017 న పేట్ల బురుజు హాస్పిటల్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమైంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణ లో అమలు అవుతుండగా, సీఎం కేసీఆర్ గారి పెరు మీదే ప్రారంభమైన ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. అంతేగాక గర్భిణీల ఆత్మగౌరవాన్ని పెంపొందించే రీతిలో దీన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. 

గర్భిణీస్త్రీ కి సమాజంలో గౌరవం పెంచే విధంగా మరియు అన్ని దశలలో గర్భిణీస్త్రీకి ప్రభుత్వం అండగా ఉండి ఒక ఆరోగ్యమైన సమాజం కొరుకు ఒక బలమైన పునాది ఏర్పరచే విధంగా రూపొందించదానికి వీలుగా  ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పధంతో ఆలోచించి కేసీఆర్ కిట్ పథకం  ప్ర‌క‌టించారు.కేసీఆర్ - కిట్ - పథకంకు ముందు  ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో సంవత్సరానికి  6 ల‌క్ష‌ల 50 వేల ప్ర‌సూతిలు జ‌రుగుతుండ‌గా, అందులో 30 శాతం  మాత్ర‌మే ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో జ‌రుగుతుండేవి. ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఆసుపత్రులలో ఎక్కువగా ప్రసవాలు ఆపరేషన్   ద్వారా  జరిగేవి. కేసిఅర్ - కిట్ పథకం  ద్వారా గర్భిణీ స్త్రీలకు సేవలందించడానికై సమగ్రమైన మూడంచెల విధానాన్ని మా ప్రభుత్వం రూపొందించింది. దీనికి అనుగుణంగా 3 దశలలో సేవలందించి మాతా శిశు ఆరోగ్యానికి  తగు వసతులను కల్పిస్తున్నామన్నారు.ప్రసవానికి ముందు సేవలు,ప్రసవ సమయంలో సేవలు,ప్రసవం తర్వాత సేవలు.కేసిఅర్ కిట్ పథకం ద్వారా ఇప్పటికే  -ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పటివరకు - 1,96,702 ప్రసవాలు జరిగాయి.వీటిలో సహజ ప్రసవాలు - 1,05,888 & ఆపరేషన్ - 91,001. 1,83,382 - కేసిఅర్ - కిట్ పంపిణీ చేశామని తెలిపారు.6,34,789 గర్భిణి స్త్రీలకు వివిధ దశలలో  201.37సిఆర్ పంపిణీ చేశాము.ఆసుపతులన్నిటిలో రద్దీ పెరిగిందని,ఈ సేవల వల్ల  ప్రభుత్వ ఆసుపతులలో ప్రసవాలు 31% నుండి  50%కు  పెరిగాయన్నారు.సహజ ప్రసవాలు పెరిగి ఆపరేషన్ లు తగ్గాయి.  ఐఎంఆర్ ( 39 నుండి 31) ;ఎంఎంఆర్ ( 92 నుండి 70) కు  తగ్గాయని తెలిపారు.పెరిగిన రద్దీని తట్టుకోవడానికికైఉన్న ఆసుపత్రులలో - 24X 7 సేవలు అందించడానికి తగు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.కొత్త 15  ఎంసిహెచ్ ఆసుపత్రులకు ప్రణాళికలు రుపొందించమని,జిల్లా, బోధనా ఆసుపత్రులలో  అవసరమైన మేరకు అదనపు పడకల ఏర్పాటు చేశామన్నారు.మానవ వనరులకు  అవసరమైనంతగా  - అనుమతులు. ( రెగ్యులర్ 4000 పోస్ట్లు & 1000 ఎన్ఎచ్ఎం పోస్ట్ లు స్టాఫ్- కు దక్షత కార్యక్రం ద్వారా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.సిబ్బందికు / ఆసుపత్రి కి  ప్రోత్సాహకాలు ( 2000/- ఓక ప్రసవానికి)సహజ ప్రసవ సేవందించడంలో ఆసుపత్రులలో డాక్టర్లకు సహాయానికి ప్రత్యేకమైన కాడర్ ఏర్పాటు. వీరికి తగు శిక్షణ కొరకై శిక్షణా కేంద్రాలు బాలింతలకు ప్రత్యేకమైన ఐసియు లను - నీలోఫార్ , పేట్లబుర్జ్ , గాంధీ, సుల్తాన్ బజార్ ఆసుపత్రులలో ప్రత్యేకమైన ఐసియు నెలకొల్పి బాలింతలకు ప్రసవానికి ముందు మరియు ప్రసవం తర్వాత సేవలనందించుతున్నాము. అవసరాన్ని బట్టి మిగితా ప్రసూతి ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తామన్నారు.పిల్లలకు సంబంధించిన ప్రత్యేకమైన  ఐసియు  లను 21 నుండి 34 కు  పెంచి నవజాత శిశువులకు అవసరమైన సేవలందించుతున్నామన్నారు.ఈ విధంగా కేసిఅర్ -కిట్ పథకం ద్వారా మాతా శిశు సంర‌క్ష‌ణ చేసి , ఆరోగ్య వంత‌మైన సమాజాన్ని  ఈ రాష్ట్రానికి అందించాల‌నుకుంటున్నాం. తెలంగాణలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న ప్రభుత్వ పథకాల్లో ఉత్తమంగా ఎంపికైంది కేసీఆర్ కిట్ల పథకం. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా సంబంధిత శాఖ అధికారులు అందుకున్నారు.

Related Posts