YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజీనామాలు ఆమోదించండి...

రాజీనామాలు ఆమోదించండి...

విశాఖపట్టణం, నవంబర్ 7, 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. నేటికీ ఆ ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్..ఆ లేఖను స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు పంపారు. అయితే గంటా రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాస్ మరోసారి స్పీకర్ ను కోరారు. తన రాజీనామాను ఆమోదిస్తే స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని మోదీ దృష్టికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తో  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్న క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలని స్టీల్ ప్లాంట్  పరిరక్షణ సమితి నిర్ణయించింది. ప్రధానిని కలిసే అవకాశం రాకపోతే నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ నెల 11న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే ఎంతో మంది రోడ్డున పడతారని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు చేస్తోన్న ఈ పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా న్యాయపరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గంటా శ్రీనివాస్ అన్నారు.  నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీలలో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మొత్తం ఏడు అభివృద్ది కార్యక్రమాలకు మోదీ శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రోడ్ షో, బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. ఈ నెల 12న ప్రధాని బహిరంగ సభ కోసం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ, ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు పీఎంవో ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాద్యతలు చేపడుతుంది.  ప్రధాని 11న విశాఖకు చేరుకుంటారు. 12వ తేదీ ఉదయం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రధాన మంత్రి విశాఖ విచ్చేయుచున్న సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఘనంగా స్వాగతం పలుకనున్నారు. ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న కార్యక్రమాల్లో  విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రాయపూర్- విశాఖపట్నం ఆరు లేన్ల రహదారి, న్వెంట్ జంక్షన్- షీలానగర్ పోర్డు రోడ్డు అభివృద్ది, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరుద్దరణ, గెయిల్ కు సంబంధించి శ్రీకాకుళం-అంగుళ్ పైప్ లైన్ ఏర్పాటు, నరసన్నపేట- ఇచ్చాపురం రోడ్డు అభివృద్ది, ఓఎన్ జీసీ యూ ఫీల్డ్ డెవలప్ మెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ షోర్ కార్యక్రమాలు ఉన్నాయి.

Related Posts