YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప సర్పంచ్ ల ఆందోళన

కడప సర్పంచ్ ల ఆందోళన

కడప, నవంబర్ 8, 
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలంటూ కడప జిల్లా  సర్పంచ్ లు ధర్నాలు, ర్యాలీకి దిగారు. సర్పంచ్ల ఖాతాలోకే నిధులు పడతాయి, పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్న ప్పటికీ ఇంతవరకూ తమ ఖాతాలో నిధులు వేయలేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు వెంటనే విడుదల చేయకుంటే తాము నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ సర్పంచ్‌ల నిరసనలు చేపట్టా రు.అర్ధవీడు మండల సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా.. కంభంమండలం సర్పంచులు కూడా అదే బాట పట్టారు. మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్క రించి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.  సర్పంచులుగా గెలిచి ఏడాదిన్నర అయినా ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ పంచా యతీ అకౌంట్లను జీరో చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయాలని వారు  అప్పట్లో డిమాండ్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా  ఏజెన్సీలోని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన చేపట్టారు. నిధుల కోసం సర్పంచ్‌లు మూకుమ్మడిగా వారపు సంతలో బిక్షాటన చేపట్టారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీ ఖాతాలలో జమ చేయాలంటూ మండలంలోని సర్పంచ్‌లు నిరసనగళం విప్పారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంతలో మండలంలోని సర్పంచ్‌లందరూ బిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  పంచాయతీలకు కేటా యించవలసిన నిధులను పక్కదారి పట్టించ వద్దంటూ సర్పంచ్‌లు  ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ.. భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.

Related Posts