YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ నేతల పాదయాత్రలు..

కాంగ్రెస్ నేతల పాదయాత్రలు..

విజయవాడ, నవంబర్ 10, 
ఏపీ పునర్ వ్యవస్థీకరణ  పుణ్యమా అంటూ కాంగ్రెస్  పార్టీ రాష్ట్రంలో కనుమరుగైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. అయితే ఓట్లు పడవని అనుకున్నారు. కానీ చాలా చోట్ల ఇండిపెండెంట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశలు రేకెత్తుతున్నాయి. మరో ఏడాదిన్నరలో రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో నాయకులంతా పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. డిసెంబర్ తొలి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రెడీ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులంతా కలిసి పని చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ విభజన సమస్యలపై ఉద్యమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హామీ ఇవ్వడంతో బీజేపీ ని గట్టిగా డిమాండ్ చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసిన పీసీసీ చీఫ్ శైలజానాథ్. కాంగ్రెస్ నాయకులతో తమ పాదయాత్రపై చర్చించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తుండటంతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 12న మోదీ ఏపీలో పర్యటించనుండటంతో  నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలతోనైనా కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఆదరిస్తారేమో చూడాలి

Related Posts