YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒక్క నెలలో 32 లక్షల పెళ్లిళ్లు

ఒక్క నెలలో 32 లక్షల పెళ్లిళ్లు

ముంబై, నవంబర్ 10, 
పెళ్లిళ్ల సీజన్‌కు సమయం ఆసన్నమవుతోంది. రానున్న రోజుల్లో ముహుర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ముహూర్తాలకు సిద్ధమవుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 32 లక్షల వివాహాలు జరగనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్  రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వేలో తేలింది. నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు జరగనున్న పెళ్లిళ్లకు ఏకంటా 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు శ్రీ బీసీ భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 3.50 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. దీంతో దేశ రాజధానిలో సుమారు వెయ్యి కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. గతేడాది ఈ సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల వివాహాలు జరగ్గా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది.CAT పరిశోధన విభాగం, CAT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ సర్వేను నిర్వహించింది. ఇటీవల దేశంలోని కొన్ని నగరాల్లో వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లను పరిగణలోకి తీసుకొని ఒక సర్వే నిర్వహించింది. ఈ ఒక్క నెలలో పెళ్లిళ్ల కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.3.75 లక్షల కోట్లు మార్కెట్లలోకి వస్తాయని సర్వే వెల్లడించింది. డిసెంబర్‌ తర్వాత మళ్లీ 2023 జనవరి నుంచి జూలై వరకు ముహుర్తాలు ఉన్నాయి.

Related Posts