YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆత్మనిర్భర భారత్

ఆత్మనిర్భర భారత్

హైదరాబాద్, నవంబర్ 10, 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. స్వదేశీ ఉత్పత్తులతోపాటు ఎరువుల ఉత్పత్తిని పెంచేందుకు ప్రధాని మోడీ పలు ఎరువుల కర్మాగారాలను జాతికి అంకితం చేశారు. ముఖ్యంగా భారతదేశంలో ఎరువుల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో నవంబర్ 12న తెలంగాణలోని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. రామగుండం ప్రాజెక్టుకు 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో ఈ ఎరువుల కార్మాగారాన్ని పూర్తిచేసి.. జాతికి అంకితం చేసేందుకు శనివారం రామగుండం చేరుకోనున్నారు.అయితే, 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోడీ.. అనేక సంవత్సరాలుగా మూతపడిన ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు ప్రత్యేక కృషి చేశారు. యూరియా ఉత్పత్తిలో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలనే లక్ష్యంతో ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధాన మంత్రి దార్శనికత.. దేశవ్యాప్తంగా ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణలో మరో అడుగు తెలంగాణ కానుంది.ప్రధానమంత్రి మోడీ 2021 డిసెంబర్ లో గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. దీని శంకుస్థాపన 22 జూలై 2016న జరిగింది. ఈ ప్లాంట్ 30 సంవత్సరాలకు పైగా మూతపడి ఉంది, దీనిని పునరుద్ధరించి దాదాపు రూ. 8600 కోట్లు ఖర్చుతో నిర్మించారు.గత నెల అక్టోబర్‌లో, హిందుస్థాన్ ఉర్వరాక్ & రసయాన్ లిమిటెడ్ కు చెందిన బరౌనీ ప్లాంట్ కూడా యూరియా ఉత్పత్తిని ప్రారంభించింది. బరౌని ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం హెచ్‌యూఆర్‌ఎల్‌ని తప్పనిసరి చేసింది. దీని అంచనా పెట్టుబడి రూ.8,300 కోట్లు కాగా.. యూరియా ఉత్పత్తి సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నుల  గా అంచనా వేశారు.2018 మే25 న హెచ్యూఆర్ఎల్ కి చెందిన సింద్రీ ఫెర్టిలైజర్ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. అదేవిధంగా, ప్రధాని మోడీ సెప్టెంబర్ 22, 2018న తాల్చేర్ ఎరువుల ప్రాజెక్ట్ పునరుద్ధరణకు పునాది రాయిని కూడా వేశారు. ఈ ప్లాంట్ బొగ్గు గ్యాసిఫికేషన్ టెక్నాలజీపై ఆధారపడింది. 2024లో దీనిని ప్రారంభించనున్నారు. రామగుండం, గోరఖ్‌పూర్‌లో ఈ యూరియా ప్లాంట్లన్నింటిని ప్రారంభించిన తర్వాత సింద్రీ, బరౌనీ, తాల్చేర్ దేశానికి కీలకంగా మారనున్నాయి. సంవత్సరానికి యూరియా 63.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగనుంది. దీని ద్వారా యూరియా దిగుమతి తగ్గనుంది. స్వదేశీ ఎరువు ఉత్పత్తి పెరగనుంది. యూరియా ఉత్పత్తిలో ఆత్మ నిర్భర్ భారత్ సాధించే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇవి గణనీయంగా సహాయపడనున్నాయి.2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోడీ.. దేశీ ఎరువుల ఉత్పత్తిని పెంచడం, రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వదేశీ యూరియా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఇప్పటికే ఉన్న 25 గ్యాస్ ఆధారిత యూరియా యూనిట్ల కోసం కొత్త యూరియా పాలసీ తీసుకువచ్చారు. దీనిని 2015 లో ప్రభుత్వం నోటిఫై చేసింది. యూరియా ఉత్పత్తిలో శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడం,  ప్రభుత్వంపై సబ్సిడీ భారాన్ని హేతుబద్ధీకరించడం దీని లక్ష్యం.. NUP-2015 అమలు వల్ల ప్రస్తుతం ఉన్న గ్యాస్ ఆధారిత యూరియా యూనిట్ల నుంచి అదనపు ఉత్పత్తికి దారితీసింది. దీని కారణంగా యూరియా వాస్తవ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా జరగనుంది.

Related Posts