తిరుపతి
మంత్రి రోజాకు శనివారం నాడు నిరసన సెగ ఎదురయింది. మొన్న శ్రీశైలం, శనివారం నగరిలో రోజాకు ఆమె వ్యతిరేక వర్గం షాక్ ఇచ్చింది. నగరి నియోజవవర్గం అధికార వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. సాయంత్రం నాలుగు గంటలకు వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించాల్సి ఉంది. సచివాలయానికి జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తాళం వేసారు. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ తాళం వేసినట్లు సమాచారం. . కేవలం మంత్రి రోజాను అడ్డుకోవడానికి కోసమే వ్యతిరేక వర్గం చేస్తున్నటువంటి పనిగా రోజా అనుచరులు చెబుతున్నారు.