YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈనెల 24 న టీటీడీపీ మహానాడు

 ఈనెల 24 న టీటీడీపీ మహానాడు

ఈ నెల 24న తెలంగాణ రాష్ట్ర మహానాడు నిర్వహిస్తామని టీటీడీపీ నేత ఎల్.రమణ పేర్కొన్నారు. టిటిడిపి మహానాడుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అయన అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ హామీలు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు, అసంపూర్తి ప్రాజెక్టులపై మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. జాతీయ మహానాడులో ఐదు తీర్మానాలు ప్రవేశపెడుతామని రమణ తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టిఆర్ఎస్ దేశంలోనే ముందుందని ఆయన విమర్శించారు. తప్పుడు పద్దతిలో పోయిన బీజేపీకి ప్రజాకోర్టులో శిక్షపడిందన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో మినిమహనడు నిర్వహించాం.  తెలంగాణలో టిడిపి రాజకీయ మార్పులను తెచ్చింది.  కేసీఆర్ నాలుగు బడ్జెట్ లలో 5లక్షల కోట్లు ఖర్చుచేసి..ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించడంలో విఫలం అయిందని అయన విమర్శించారు.  2014 ముందు ప్రాజెక్ట్ ల పై చర్చ జరుపుతాము. విద్యా, వైద్య రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ ని ప్రభుత్వ హాస్పిటల్ గా మారుస్తామని రమణ అన్నారు.  టిడిపి నవయువకులను ప్రోత్సాహకాలు అందిస్తుంది.  2019 ఎన్నికల్లో టిడిపి యువకులను కలుపుకొని వెళ్తుంది.  తెలంగాణ ప్రజలు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. తెలంగాణలో టిడిపి నిర్వహించిన మహానాడుకు విశేష స్పందన వచ్చిందని అన్నారు.

2019లో టీడీపీ లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదని మరో టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం తప్పులు తడకని ఆయన విమర్శించారు.  టిడిపి తొలిమహనాడు నుంచి ఇప్పటి వరకు పాల్గొనే అదృష్టం నాకు వచ్చింది.  ఎన్టీఆర్ ఘాట్ లో నివాళ్ళు అర్పించి..మహానాడుకు వెళ్తాం. చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం కార్యక్రమంలో పాల్గొంటారు.  టిడిపి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది.  దేశంలో అత్యంత బలహీనమైన ప్రధానిగా మోడీ చరిత్రలో మోడీ నిలిచారు.  తెలుగు రాష్ట్రాల పునర్విభజన చట్టంలో హామీలను కేంద్రం అమలు చెయ్యడంలో వైఫల్యం చెందిందని అన్నారు. కేసీఆర్ రైతు బంధు పథకం తప్పుల తడక.  ఉమ్మడిగా ఐదు తీర్మానాలు ఉంటాయి. పరిశ్రమల వల్ల 8 లక్షల మంది ఉపాధిని కేసీఆర్ పాలనలో కోల్పోయారు.  రైతు బంధు పథకంలో కౌలు రైతులను గలికివదిలేశారు. తెలుగువాళ్లు ఉన్నంతకాలం టిడిపి ఉంటుంది.  తెలంగాణలో 2019లో టిడిపి లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదని అయన అన్నారు. 

Related Posts