YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేఎన్టీయూలో డ్యూయల్ డిగ్రీ

జేఎన్టీయూలో డ్యూయల్ డిగ్రీ

కాకినాడ, నవంబర్ 14, 
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్‌ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ప్రాంగణ నియామకాల్లో ప్రాధాన్యంతోపాటు అదనపు క్రెడిట్లు దక్కుతాయని రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ తెలిపారు. సమయం వృథా కాకుండా బీటెక్‌ పూర్తయ్యేలోపే రెండు డిగ్రీలు చేతికి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీబీఏలో మరిన్ని కోర్సులు తీసుకురావాలనే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసిన సామర్థ్యంతో కొలువుతోపాటు ప్యాకేజీ ఎక్కువగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో డ్యూయల్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విధి విధానాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో యూజీసీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఆలోచనల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచే వర్సిటీలో కోర్సును ప్రవేశపెట్టారు.బీబీఏ-డేటా అనలిటిక్స్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. దీనికి సంబంధించి సిలబస్‌ సిద్ధమైంది. కోర్సు బోధన వారానికి ఐదు రోజులు ఆన్‌లైన్‌, ఒకరోజు ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు చేయొచ్చు. బీబీఏ-డేటా అనలిటిక్స్ కోర్సు వ్యవధి మూడేళ్లు. దీనికి సంబంధించి సిలబస్ సిద్ధమైంది. కోర్సు బోధన వారానికి ఐదు రోజులు ఆన్‌లైన్ ఒకరోజు ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లోని ఇంజినీరింగ్ విద్యార్థులందరూ బీబీఏ కోర్సు కూడా చదవొచ్చు.

Related Posts