ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో గ్రంధాలయంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు, పరిశోధకులు ఆందోళనకు మంగళవారం దిగారు. 24 గంటలు లైబ్రరీ అందుబాటులో ఉంచాలని, తదితర అనేక సమస్యలు పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు. మండు వేసవిలో ఎండని సైతం లెక్కచేయకుండా మెట్లపైనే ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి ఆహారం సైతం మాని ఆందోళన చేపట్టగా ఓ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆ విద్యార్థిని తోటి విద్యార్థలు ఆసుపత్రికి తరలించారు. ఆందోళన చేస్తున్న క్రమంలో సదరు అధికారి ఉద్యోగులను విద్యార్థులపై దాడికి ఉసిగొల్పారాని ఆరోపించారు. దీనితో వికాస నాయకులకు మరియు విద్యార్థులకు మధ్య వాగ్యుద్ధం జరిగినది. దీనితో అక్కడి వాతావరణం గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అధికారి ఆదేశాలతో అక్కడి సిబ్బంది లైబ్రరీ కి తాళం వేశారు. కొద్దిసేపటి అనంతరం తిరిగి వచ్చి పోలీసుల సహాయం తో గ్రంధాలయాన్ని ఓపెన్ చేశారు. అయినప్పటికీ విద్యార్థులు మండుటెండలో ఆందోళన కొనసాగించారు.