YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతుబంధు చెక్కులు తీసుకోని వారు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలి జూన్ 2 లోగా ప్రతీ ఒక్కరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ముఖ్యమంత్రి కేసీఆర్

రైతుబంధు చెక్కులు తీసుకోని వారు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలి      జూన్ 2 లోగా ప్రతీ ఒక్కరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకం             ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2 లోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో మంగళవారం  రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియపై సీఎం సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు తీసుకోని వారెవరైనా ఉంటే.. తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. దేశంలో ఏ కార్యక్రమానికి రానంత స్పందన రైతుబంధుకు వస్తుందన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్దిమందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని తెలిపారు. సమస్యలేమున్నా పరిష్కరించి అందరికీ పాస్ పుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని ఆదేశించారు. పంట పెట్టుబడి సాయం చేతికందిన తర్వాత రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. జూన్ 2న కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వందకు వంద శాతం దిగ్విజయం చేయాలన్నారు.  ఎక్కడికీ తిరగకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భూరికార్డులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందించడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. . ఈ సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, వ్యవసాయ, రెవెన్యూ,ఆర్థిక శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Related Posts