విజయవాడ, నవంబర్ 16,
ఏపీలో ఉన్నత విద్యా సంస్థలకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి సిద్ధం చేసింది. దీనిప్రకారం మూడేళ్ల డిగ్రీకి సంబంధించి 6 సెమిస్టర్లను, పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు ఈ షెడ్యూలను పాటించాల్సి ఉంటుంది. యూజీసీ ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు ఉమ్మడి క్యాలెండర్‌ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
సెమిస్టర్ షెడ్యూలు..
డిగ్రీ (యూజీ) కోర్సులకు మొదటి సెమిస్టర్‌ను వచ్చే ఏడాది జనవరి 28లోపు పూర్తి చేయాలి.
ఇక రెండో సెమిస్టర్‌ను ఫిబ్రవరి 6న మొదలుపెట్టి మే 20తో ముగించాల్సి ఉంటుంది.
కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు మే 29 నుంచి జులై 8 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీరికి రెండో ఏడాది తరగతులు జులై 10 నుంచి ప్రారంభమవుతాయి.
డిగ్రీ మూడో సెమిస్టర్ నవంబరు ఒకటి నుంచి మొదలై ఫిబ్రవరి 18తో ముగుస్తుంది.
నాలుగో సెమిస్టర్ ఫిబ్రవరి 29న ప్రారంభమై జూన్ 17తో ముగుస్తుంది. వీరికి 2023-24 విద్యా సంవత్సరం ఆగస్టు 7నుంచి మొదలవుతుంది.
ఐదో సెమిస్టర్ తరగతులు, ఇంటర్న్‌షిప్ నవంబరు 17 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28తో ముగుస్తుంది.
ఆరో సెమిస్టర్ తరగతులు, ఇంటర్న్‌షిప్ మార్చి 13 నుంచి జూన్ 10వరకు కొనసాగుతాయి. పరీక్షల మదింపు జూన్ 12-24 వరకు ఉంటుంది.
పరీక్షల షెడ్యూలు ఇలా...
మొదటి సెమిస్టర్ పరీక్షలను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహించనున్నారు.
రెండో సెమిస్టర్ పరీక్షలను మే 22 నుంచి మే 27 వరకు నిర్వహించనున్నారు.
మూడో సెమిస్టర్ పరీక్షలను ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 28 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 19 నుంచి జూన్ 24 వరకు ఉంటాయి. షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ (200 గంటలు) జూన్ 26 నుంచి ఆగస్టు 5 వరకు చేయాల్సి ఉంటుంది.
ఐదో సెమిస్టర్ సెమిస్టర్ పరీక్షలు, ఇంటర్న్‌షిప్ మదింపు మార్చి 1 నుంచి 11 వరకు కొనసాగనున్నాయి.
ఆరో సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ మార్చి 13 నుంచి జూన్ 10 వరకు, పరీక్షల మదింపు జూన్ 12 - 24 వరకు ఉంటుంది.
యూజీ ఆయూష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయూష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సులల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నవంబరు 12న నోటిఫికేషన్ జారీ చేసింది. 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీకు 40 శాతం, దివ్యాంగుకు 45 శాతం మార్కులు) ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణులై , నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు నవంబరు 13న ఉదయం 8 గంటల నుండి నవంబరు 20న రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్ధులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు