YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

25 మందికి సిట్టింగ్ లకు గల్లంతేనా

25  మందికి సిట్టింగ్ లకు గల్లంతేనా

విజయవాడ, నవంబర్ 16, 
ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి కూడా  అదే మాదిరిగా మారిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన ప్రతిసారీ   జగన్ వారిపట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, వారినే తప్పుపడుతుండడం, వారి పనితీరుపై వ్యతిరేక సర్వే నివేదికలతో భవిష్యత్తులో సీట్లు ఇచ్చేది లేదని బెదిరింపులకు దిగుతుండడంపై వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతోందని అంటున్నారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమకు   జగన్ సీటు ఇచ్చే ఛాన్స్ లేదని గట్టిగా భావిస్తున్న సిటింగ్ లు, ఒకవేళ వైసీపీ నుంచి సీటు వచ్చినా.. జగన్ సర్కార్ పై ఏపీ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న వ్యతిరేకత కారణంగా ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు కనిపించని వారు గోడ దూకేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. తద్వారా అయినా తమ రాజకీయ భవిష్యత్తును సజీవంగా ఉంచుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రణాళికలు వేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. ఏ పార్టీలో చేరితే తమ భవిష్యత్తు బాగుంటుంది.. విజయావకాశాలు మెరుగవుతాయి అనే లెక్కలు   వేసుకుంటున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.వచ్చే డిసెంబర్ లో జరిగే వైసీపీ శిబిరంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో టికెట్లు రావనుకుంటున్న వారు, ఒకవేళ టికెట్ వచ్చినా గెలిచే ఛాన్స్ లు తక్కువని భయపడుతున్నవారు, వైసీపీలో కంటే ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్నాయనుకుంటున్నవారు వైసీపీ బంధనం నుంచి ఎలా బయట పడాలా అని దిక్కులు చూస్తున్నారని తెలుస్తోంది. అలా పక్కదార్లు వెతుక్కుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 25 నుంచి 30  వరకు ఉంటుందంటున్నారు. దాంతో పాటు టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడిస్తే.. ఇక తమ ఉనికికి గండం తప్పదని భయపడుతున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారంటున్నారు. ఏయే ఎమ్మెల్యేలు వైసీపీని వదిలిపెట్టేస్తారు..? అలాంటి వారి కోసం ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసే పార్టీలు ఏవి అనే అంశాలపై వైసీపీ అధినాయకత్వం గట్టి నిఘాయే పెట్టిందంటున్నారు.  వైసీపీ నుంచి ఎవరెవరు పార్టీ ఫిరాయిస్తారు అనే దానిపై జగన్ రెడ్డి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా కీలక సమాచారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.వైసీపీ గోడ దూకి బయటి పార్టీల వైపు చూసే ఎమ్మెల్యేలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటారని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఆ జిల్లాల్లో టీడీపీ, జనసేన పార్టీ దేనికదే బలంగా ఉండడమే కారణం అంటున్నారు. ఈ రెండు పార్టీ మధ్య పొత్తు కుదిరితే వచ్చే ఎలక్షన్ వార్ లో విజయం వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దాంతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి కూడా పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే వారు ప్రత్యర్థి పార్టీలతో నిరంతరం టచ్ లో ఉంటున్నారని, వైసీపీని వదిలిపెట్టేసినా తమ స్థానానికి భంగం కలగకుండా చూసుకుంటున్నారంటున్నారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Posts