YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిట్ ఫండ్ కంపెనీల పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ గిరిజన,గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులోకి బ్యాకింగ్ సేవలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

 చిట్ ఫండ్ కంపెనీల పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ గిరిజన,గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులోకి బ్యాకింగ్ సేవలు          ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

రాష్ట్రంలో ఉన్న వివిధ చిట్ ఫండ్ కంపెనీల రోజువారీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 14వ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ గిరిజన,గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాలేదని కావున ఈవిషయంలో ఆర్ బిఐ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.పట్టణ ప్రాంతాల్లో అవసరానికి మించి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నా గ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో మాత్రం ప్రజలకు ఇంకా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాలేదని ఇప్పటికైనా ఈవిషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు.ప్రజలకు తాగునీరు,ఆరోగ్య సేవలు,రహదారులు వంటివి ఏవిధంగా నిత్యావసరాలో అదే రీతిలో బ్యాంకింగ్ సేవలు కూడా నిత్యావసరమని సిఎస్ స్పష్టం చేశారు.అదే విధంగా ఆర్ధికపరమైన కార్యకలాపాల విషయంలో తప్పుడు మెసేజ్ లు,సందేశాలు ఇచ్చి ప్రజలను మోసం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని సిఎస్ చెప్పారు. ముఖ్యంగా పలానా మొబైల్ నంబరుకు లాటరీ తగిలిందనో లేక బహుమతి వచ్చిందనో నమ్మించి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పిన్,ఇతర వివరాలు కావాలని అడిగే మోసపూరితమైన  సందేశాలు లేదా ఎస్ ఎంఎస్ లను నమ్మి ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పారు.ఇందుకుగాను ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ద్వారాను,ఎఫ్ ఎం రేడియో,ఇతర ప్రచార మాద్యమాల్లో ప్రచార అవగాహనా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని ఆయన సూచించారు.అదేవిధంగా సినిమా ధియేటర్లలో సంక్షిప్త డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ సిఎస్ దినేష్ కుమార్ అన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో నిర్వహించబడుతున్న వివిధ చిట్ ఫండ్ కంపెనీల రోజువారీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు వీలుగా ఐజి రిజిస్ట్రేషన్స్ వారి కార్యాలయంలో ప్రత్యేక మానిటర్ సెల్ ను ఏర్పాటు చేయాలని సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.ప్రస్తుతం రాష్ట్రంలో 616 చిట్ ఫండ్ కంపెనీలు రిజిష్టర్ కాబడి నిర్వహించ బడుతున్నాయని స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషనల్ శాఖ ఐజి వెంకటరామి రెడ్డి వివరించారు.ఏఏ చిట్ ఫండ్ కంపెనీలు ప్రజల నుండి ఎంత మేరకు సొమ్ము సేకరించింది వాటీ ఆస్తుల ఏమిటి,వాటి పనితీరు ఎలాగుందనే వివిధ అంశాలను ఎప్పటి కప్పుడు ఈప్రత్యేక సెల్ మానిటర్ చేయాలని చెప్పారు.నకిలీ చిట్ ఫండ్ కంపెనీలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.

రిజర్వు బ్యాంకు ఆప్ ఇండియా ఆంధ్రా,తెలంగాణా ప్రాంత రీజనల్ డిప్యూటీ డెరెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యన్ అజెండా వివరిలాను వివరిస్తూ ఆర్ధికపరమైన అంశాలలో నకిలీ సందేశాలు,ఇతర మార్గాల ద్వారా ప్రజలను మోసం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండేలా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.దీనిలో భాగంగా ప్రత్యేక హోర్డింగ్ లు, బస్సులపై ప్రకటనలు వ్రాయించడం జరుగుతోందని చెప్పారు.అలాగే విశాఖపట్నం, విజయవాడ,తిరుపతిల్లో ఎఫ్ ఎం రేడియో ద్వారా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.అనంతరం గత సమావేశపు నిర్ణయాల మినిట్స్ ను ఆమోదించడం తోపాటు అజెండాలోని ఇతర అంశాలను సభ ముందు ఉంచగా వాటిపై సమావేశంలో సవివరంగా చర్చించారు.

ఈసమావేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్ అనురాధ,ఆర్ బిఐ జనరల్ మేనేజర్ శంకర్,ఎస్ఎల్ బిసి కన్వీనర్ మరియు ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్ వర ప్రసాద్,కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్డి ఎంపి షా,ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిడా.కె.వి.వి.సత్యనారాయణ,న్యాయశాఖ కార్యదర్శి వెంకట రమణ,స్టాంపులు,రిజిష్ట్రేషన్లశాఖ ఐజి వెంకట్రామరెడ్డి,సిఐడి ఎస్ పి.ఉదయ భాస్కర్,ఇతర విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts