YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఐపీఎల్ వేలానికి వేళాయోరా

ఐపీఎల్ వేలానికి వేళాయోరా

ముంబై, నవంబర్  16, 
ఐపీఎల్ 2023 లో రీటెయిన్ మరియు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని జట్లు బీసీసీఐకి సమర్పించాయి. నవంబర్ 15తో గడువు ముగియటంతో ఫ్రాంచైజీలన్నీ తాము అట్టి పెట్టుకున్న, విడుదల చేసిన ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి అందజేశాయి.కొన్ని ఫ్రాంచైజీలు అగ్రశ్రేణి ఆటగాళ్లను వదిలేశాయి. మరికొన్ని ఎక్కువ మందిని రిలీజ్ చేసి తమ పర్స్ వాల్యూ పెంచుకున్నాయి. రిలీజైన ఆటగాళ్లు డిసెంబర్ 23న కొచ్చిలో జరిగే వేలంలో అందుబాటులోకి వస్తారు
ముంబయి పొలార్డ్ కు బై
5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయికి గత సీజన్‌ ఓ పీడకల. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అందుకే ఈసారి పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో విధ్వంసకర ఆటగాడు  కీరన్‌ పొలార్డ్‌ను వదిలేసింది. అలాగే అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయ్‌దేవ్ ఉనద్కత్‌, మయాంక్‌ మార్కండే, మురుగన్ అశ్విన్‌, రాహుల్‌ బుద్ది, రిలీ మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్‌ డేవిడ్, రమణ్‌దీప్‌ సింగ్‌, తిలక్ వర్మ, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్‌ స్టబ్స్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, అర్జున్ తెందూల్కర్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ సింగ్‌, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, అర్షద్‌ ఖాన్, అకాశ్ మాధ్వాల్‌.
చెన్నైతోనే జడేజా
చెన్నై జట్టులో కీలక ఆటగాడైన రవీంద్ర జడేజాకు, యాజమాన్యానికి మధ్య విభేదాలు వచ్చినట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిని ఫ్రాంచైజీ విడుదల చేస్తుందని భావించారు. అయితే అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ చెన్నై జడేజాను రిటైయిన్ చేసుకుంది. అయితే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోను రిలీజ్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అతడితోపాటు ఆడమ్ మిల్నే, క్రిస్ జొర్డాన్, ఎన్‌. జగదీశన్, సి. హరినిశాంత్, కే. భగత్‌ వర్మ, కేఎం. అసిఫ్, రాబిన్ ఉతప్ప (రిటైర్డ్‌)ను రిలీజ్‌ చేసింది.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్‌ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, రాజ్‌వర్థన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, మహీషా పతిరాన
హైదరాబాద్ కెప్టెన్ ఔట్
గత సీజన్‌లో దారుణ ప్రదర్శన చేసిన హైదరాబాద్‌ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ నే వదిలేసింది. మరో సీనియర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ను రిలీజ్ చేసింది. వీరితోపాటు  జగదీశ సుచిత్, ప్రియమ్‌ గార్గ్‌, రవికుమార్‌ సమర్థ్, రొమారియో షెఫెర్డ్‌, సౌరభ్ దూబె, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయస్‌ గోపాల్, సుషాంత్‌ మిశ్రా, విష్ణు వినోద్‌ను వదులుకుంది. దీంతో ఆ ఫ్రాంచైజీ ఖాతాలో రూ. 42.25 కోట్లు ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీలు కన్నా హైదరాబాద్ వద్దే ఎక్కువ పర్స్ వాల్యూ ఉంది.
 ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, అయిడెన్ మార్‌క్రమ్, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్‌ ఫిలిప్స్‌, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూఖి, కార్తిక్‌ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్.
కోల్‌కతా కీలక నిర్ణయాలు
కోల్‌కతా కఠిన నిర్ణయాలను తీసుకున్నట్లు కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్‌, అమన్ ఖాన్, శివమ్‌ మావి, మహమ్మద్ నబి, చమిక కరుణరత్నె, ఆరోన్ ఫించ్‌, అలెక్స్ హేల్స్, అభిజిత్‌ తోమర్, అజింక్య రహానె, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, పార్థుమ్ సింగ్‌, రమేశ్‌ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్‌లను వదిలేసింది.
 ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితిశ్ రాణా, రహ్మనుతుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్‌ చక్రవర్తి, అనుకుల్‌ రాయ్, రింకు సింగ్‌.
బెంగళూరు జట్టు
బెంగళూరు పెద్ద ఆటగాళ్లను విడుదల చేయలేదు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, అనీశ్వర్ గౌతమ్, చమ మిలింద్, లవ్‌నిత్‌ సిసోదియా, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌ను వదిలేసింది. వీరిలో బెహ్రెన్‌డార్ఫ్‌ను ముంబయి సొంతం చేసుకొంది.
 ఆటగాళ్లు:  ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్‌, రజత్‌ పాటిదార్, దినేశ్‌ కార్తిక్‌, అనుజ్‌ రావత్‌, ఫిన్‌ అలెన్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, వనిందు హసరంగ, షహబాజ్‌ అహ్మద్, హర్షల్‌ పటేల్, డేవిడ్‌ విల్లే, కర్ణ్‌ శర్మ, మహిపాల్ లామ్రోర్, మహమ్మద్ సిరాజ్‌, జోస్ హేజిల్‌వుడ్‌, సిద్దార్థ్ కౌల్, ఆకాశ్ దీప్‌.
ఢిల్లీ శార్దూల్ రిలీజ్
ఢిల్లీ జట్టు పెద్దగా పేరున్న ఆటగాళ్లను రిలీజ్ చేయలేదు. శార్దూల్ ఠాకూర్, టిమ్‌ సీఫెర్ట్, అశ్విన్‌ హెబ్బర్, శ్రీకర్ భరత్, మన్‌దీప్‌ సింగ్‌ను వదిలేసింది.
ఆటగాళ్లు: రిషభ్‌ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపల్ పటేల్, రోవ్‌మన్‌ పావెల్, సర్ఫరాజ్‌ ఖాన్, యశ్‌ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఆన్రిచ్‌ నోకియా, చేతన్ సకారియా, కమ్లేష్ నాగర్‌కోటి, ఖలీల్‌ అహ్మద్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్‌ రహ్మాన్, అమన్ ఖాన్, కుల్‌దీప్‌ యాదవ్, ప్రవీణ్‌ దూబె, విక్కీ ఓత్స్వాల్‌.
రాజస్థాన్ జట్టు
ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ను రాజస్థాన్‌ వదిలేసింది. అలాగే అరుణయ్‌ సింగ్, కార్బిన్ బాస్క్, డారిల్‌ మిచెల్‌, కరుణ్‌ నాయర్, నాథన్ కౌల్టర్‌నైల్, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్, శుభమ్ గర్హ్వాల్‌, తేజ్ బరోక తదితరులను రిలీజ్‌ చేసింది.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్‌మయేర్, దేవ్‌దత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్‌ మెక్‌కాయ్‌, నవ్‌దీప్‌ సైని, కుల్‌దీప్‌ సేన్, కుల్దిప్‌ యాదవ్, ఆర్‌ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కేసీ కరియప్ప.
పంజాబ్‌ మాజీ కెప్టెన్ గయా
పంజాబ్ తమ మాజీ కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్ ను రిలీజ్‌ చేసింది. ఓడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్‌ పోరెల్, అన్ష్‌ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, వృత్తిక్‌ ఛటర్జీని వదిలేసింది.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్‌ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభాసిమ్రన్‌ సింగ్, భానుక రాజపక్స, జితేశ్‌ శర్మ, రాజ్‌ బవా, రిషి ధావన్, లియామ్‌ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్‌ సింగ్‌, బాల్తేజ్‌ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్‌ బ్రార్.
గుజరాత్ రాయ్ రిలీజ్
అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను నెగ్గిన జట్టు గుజరాత్. గత సీజన్‌లో ఆడని జాసన్‌ రాయ్‌ను వదిలేసింది. అతడితోపాటు రహమ్మనుతుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రాక్స్, గుర్‌కీరత్‌ సింగ్‌, వరుణ్‌ అరోన్‌ ను రిలీజ్‌ చేసింది.
 ఆటగాళ్లు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్‌ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మ్యాథ్యూ వేడ్, రషీద్‌ ఖాన్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్‌, యశ్‌ దయాల్, ప్రదీప్‌ సంగ్వాన్, దర్శన్ నల్కందే, జయంత్ యాదవ్, ఆర్‌ సాయి కిశోర్, నూర్ అహ్మద్
లక్నో జట్టు
తొలిసారి టీ20 లీగ్‌ బరిలోకి దిగిన లఖ్‌నవూ పలువురిని వదిలేసింది. ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్‌, దుష్మంత చమీర, ఇవిన్ లూయిస్, జాసన్ హోల్డర్‌, మనీష్ పాండే, షహబాజ్‌ నదీమ్‌ను రిలీజ్‌ చేసింది.
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టొయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్‌ మయేర్స్, కృనాల్ పాండ్య, అవేశ్ ఖాన్‌, మోహ్‌సిన్ ఖాన్, మార్క్‌వుడ్, మయాంక్‌ యాదవ్, రవి బిష్ణోయ్.

Related Posts