YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రమణ దీక్షీతులు వెనుక బీజేపీ :ఉప ముఖ్యమంత్రి కేఈ

రమణ దీక్షీతులు వెనుక బీజేపీ :ఉప ముఖ్యమంత్రి కేఈ

ప్రత్యేక హోదాను దారిమళ్లించేందుకే టీటీడీ వివాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రమణ దీక్షితులు రాజకీయ ముసుగు వేసుకొని అలజడి సృష్టించారన్నారు. టీటీడీ ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. 17ఏళ్ల క్రితం మైసూర్ మహారాజు ఇచ్చిన వజ్రం మాయమైతే ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. టీటీడీ అర్చకులుగా పదవీ విరమణ చేసిన వారి వంశస్తులనే ప్రధానార్చకులుగా నియమించామన్నారు. రమణదీక్షితుల వ్యవహారంలో బి.జె.పి పెద్దల పాత్ర వుంది.  రమణ దీక్షితులు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను, రాజ్ నాధ్ సింగ్ ను కలవడంలో ఆంతర్యం ఏమిటని అయన ప్రశ్నించారు.  బి.జె.పి  ఈ తతంగాన్ని అంతా తెరువెనుక నుంచి నడిపిస్తుంది.  కర్నాటక ఎన్నికల తరువాత రాష్ట్రంలో భూకంపం స్రుష్టిస్తామని బి.జే.పి అధికార ప్రతినిధి జి.వి.ఎల్ నరసింహారావు అన్నారు.   తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా అలజడి సృష్టించి, ప్రజల్లో అభధ్రతా భావం కలిగించాలని ప్రయత్నం జరుగుతుందని అయన అన్నారు.  ఈ వ్యవహారం లో జగన్ పాత్ర ఉందనే విషయం ప్రజలు అర్ధం చేసుకున్నారు.  జగన్ బిజెపితో కలిసి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఆయన పైన ఉన్న కేసులను తొలగించుకోవడానికి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు.  ప్రతీ విషయంలో జగన్ తలదూర్చి చంద్రబాబు పై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని అయన అన్నారు.   భక్తుల మనోభావాలతో చలగాటం ఆడుతున్న వారికి తప్పక బుద్ది చెబుతాం. దీని వెనుక ఎంతటివారు ఉన్నా బయట పెడతాం.   ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు ఎంత నియంత్రుత్వ పోకడతో వ్యవహరించారో అక్కడ అర్చకులే చెబుతున్నారు.  1952 నుంచి స్వామివారి ఆభరణాలకు సంధించిన రికార్డు టిటిడి దగ్గర వుంది. రికార్డులో ఆభరణాలకు సంబంధించిన ఏవైతే వివరాలు పొందుపర్చారో, అన్ని తిరుఆభరణాలు టిటిడి దగ్గర ఉన్నాయి. ఆభరణాలు మిస్సయ్యాయి, అన్న ప్రచారం లో వాస్తవం లేదని అన్నారు. 2001 లో వజ్రం పోయిందని రమణదీక్షితులు ఆరోపణలు చేశారు . నిజంగా మైసూర్ మహారాజులు ఇచ్చిన ప్లాటినమ్ హారంలో ని వజ్రం  కనపడకపోతే  గత 17 సంవత్సరాలుగా  ఎందుకు నోరు మెదపలేదు. మౌనంగా ఎందుకు ఉన్నారు.  వాస్తవంగా పింక్ డైమండ్ అనేది, టి.టి.డి రికార్డుల్లో ఎక్కడా లేదు. గరుడ సేవ సంధర్భంగా నాణాలు తగిలి పగిలింది డైమండ్ కాదు రూబీ అని అప్పటి జె.ఇ.వో ఐ.వై.ఆర్ క్రిష్ణారావు తేల్చినట్లు రికార్డుల్లో స్పష్టంగా వుంది.   డైమండ్ కి పగిలే స్వభావం ఉండదు. పగిలింది రూబీనే అని రృష్ణారావు  లిఖితపూర్వక నివేదికలో స్పష్టంగా చెప్పారు. పగిలిన రూబీ కూడా టి.టి.డి దగ్గర వుంది.  1996 సంవత్సరంలో మిరాశీ వ్యవస్ధను రద్దు చేసినప్పుడు, అప్పుడు మిరాశీదారులుగా వున్నరమణ దీక్షితులు టీటీడీ కి అప్పగించిన అన్ని నగల భధ్రంగానే ఉన్నాయని లిఖితపూర్వకంగా  అంగీకరించారని గుర్తు చేసారు.     దేవాలయంలో మరమత్తులు జరుగుతూనే ఉంటాయి. పర్మనెంట్ స్ట్రక్టర్ రాతి గోడ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోటును రిపేరు చేయడం జరిగింది. ఎలాంటి తవ్వకాలు జరగలేదు. ఆగమ సలహాదారుడు సుందరవదన్ ఆమోదంతోనే మరమత్తులు చేపట్టాం.   అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పరిమితం చేస్తూ ఈ ప్రభుత్వంగానీ, టి.టి.డి బోర్డుగానీ కొత్తగా నిర్ణయం తీసుకోలేదు.  2011-12 అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, అమలు పరిచింది. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ ను విచారించి హైకోర్టు ఎలాంటి జీతాలు లేకుండా అర్చకులు స్వామివారి సేవ చేసుకొనే విధంగా అనుమతి ఇవ్వాలని, టి.టి.డిని ఆదేశిస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత కాలంలో కోర్టుకు వెళ్లిన అర్చకులు తమ పిటీషన్ ను వెనక్కి తీసుకున్నారు.   పదవీ విరమణ వయస్సు అమలు చేసి తమకు కూడా అవకాశం ఇవ్వాలని కొంతమంది  ప్రాధానార్చకుల కుటుంబాల్లోని సభ్యులే కోర్టును ఆశ్రయించారు.   కోర్టుకు వెళ్లినవారిని పిలిపించి మాట్లాడిన తరువాతే పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పరిమితం చేయాలని నిర్ణయించామపకపానే.  ఇక స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలు సక్రమంగా జరగట్లేదని, స్వామివారిని పస్తు పెడుతున్నారని ఆరోపించారు. స్వామివారికి కైంకర్యాలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ వారు, చిన్న జీయర్ వారు చాలా స్పష్టంగా చెప్పారు.  టి.టి.డి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లోని అర్చకులకు మాత్రమే 65 సంవత్సరాల తరువాత  రిటైర్మెంట్ వర్తిస్తుంది. రిటైర్మంట్ తరువాత ప్రభుత్వం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందిస్తుందని అన్నారు. 

Related Posts