విజయవాడ, నవంబర్ 22,
నేటి రాజకీయాల్లో వ్యూహకర్తల హవా పెరిగిపోయింది..రాజకీయ పార్టీలు సొంత వ్యూహాలని నమ్ముకుని ముందుకెళ్లడం కంటే..వ్యూహకర్తలని పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఈ వ్యూహకర్తల రాజకీయం వైసీపీతోనే మొదలైంది. 2014లో ఓటమితో జగన్..ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా పెట్టుకుని 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పీకే టీంని కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోటీ ఎవరి మధ్య ?. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన మధ్య పోటీ ఉంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంక్ ప్రకారం చూస్తే ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంటుంది. జనసేన డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. రాజకీయ పార్టీల మధ్య పోరాటం ఇలా ఉంటుంది. కానీ.. ఆ రాజకీయ పార్టీల విధానాలను డిసైడ్ చేస్తున్న ధర్డ్ పార్టీల ప్రకారం చూస్తే పోరాటం మాత్రం ప్రశాంత్ కిషోర్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ అని సాగుతుంది. ఎందుకంటే.. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు ప్రశాంత్ కిషోర్ శిష్యులే స్ట్రాటజిస్టులుగా ఉన్నారు. ఒకరి వ్యూహాలపై ఒకరికి అవగాహన ఉండటంతో వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. రెండు పార్టీలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)నే మరోసారి వైఎస్ఆర్‌సీపీకి పని చేస్తోంది. ఐతే ఇక్కడ వ్యూహకర్త మాత్రం మారారు. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంత రాజకీయం చేసుకుంటున్నారు. దీంతో ఐప్యాక్ లో కీలక పొజిషన్‌లో ఉన్న రిషి రాజ్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేస్తున్నారు. ఐప్యాక్ వ్యవస్థాపకుడు అయిన ప్రశాంత్ కిషోర్ ఆలోచనల్ని పక్కాగా అమలు చేస్తారు రిషిరాజ్. అందుకే ఆయనకు స్ట్రాటజిస్ట్‌గా బాధ్యతలు అప్పగించింది. అధికారికంగా ఐ ప్యాక్ కోసమే పని చేస్తున్నా.. మొత్తం రిషి రాజ్ కనుసన్నల్లో వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీలు నడుస్తున్నాయి. ఈమెకు అసలు ఎముకలు ఉన్నాయా..!తెలుగుదేశం పార్టీ తమ వ్యూహక్రతగా రాబిన్ శర్మను నియమించుకుంది. ఇటీవల పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు రాబిన్ శర్మతో మాట్లాడించారు కూడా. రాబిన్ శర్మ.. గతంలో పీకే టీంలో కీలకంగాపని చేసి… తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. రాబిన్ శర్మ టీం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే పని చేస్తోంది. క్షేత్ర స్థాయిలో ఎవరికీ తెలియని టీములతో పని చేయిస్తున్నాయి. గత కొన్ని నెలలు అనేక సర్వేలు చేస్తూ, టిడిపి ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్లాలని విషయంపైనే సలహాలు, సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రాబిన్ శర్మతో పాటు టీడీపీ సునీల్ కనుగోలు అనే మరో స్ట్రాటజిస్ట్‌ను కూడా నియమించుకుంది. అయితే ఆయన కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో పని చేస్తున్నారు. ఈ కారణంగా వ్యక్తిగతంగా టీడీపీ స్ట్రాటజీలపై దృష్టి సారించలేకపోతున్నారు.అందుకే ఆయనతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఆయన కూడా ఐ ప్యాక్ నుంచి వచ్చి వేరే సంస్థను పెట్టుకున్నవారే. రిషి రాజ్, రాబిన్ శర్మ.. ఒకరి వ్యూహాలకు కౌంటర్‌గా మరొకరు.. స్ట్రాటజీలు రెడీ చేస్తున్నారు. వారిని ఆయా రాజకీయ పార్టీలు ఫాలో అయిపోతున్నాయి. ప్రజలకు కష్టాలు తెలియకుండా మీకు ఇన్ని లక్షలు ఇస్తున్నామని చెప్పేందుకు ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలను పంపే కార్యక్రమానికి రిషిరాజ్ వైఎస్ఆర్‌సీపీ కోసం రూపకల్పన చేశారు. దానికి గడప గడపకూ మన ప్రభుత్వం అని పేరు పెట్టారు. దీనికి కౌంటర్‌గా రాబిన్ శర్మ కొత్తగా మనకు ఇదేం ఖర్మ అనే ప్రోగ్రాంను టీడీపీకి అసైన్ చేశారు. ఇదేం ఖర్మ అంటూ.. టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి… జగన్ రాక ముందు ఏలా ఉందో.. జగన్ వచ్చిన తర్వాత ఎంత ఖర్మ పట్టిందో వివరించనున్నారు. ప్రభుత్వం సృష్టిస్తున్న ఫీల్ గుడ్ వాతావరణం లేదని .. మీ మీద పన్నులు బాదడమే.. మిమ్మల్ని తాకట్టు పెట్టేసి జగన్ లక్షల కోట్లు అప్పు చేసి దుబారా చేయడమో.. లేకపోతే నొక్కేశారని చెప్పడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల స్ట్రాటజీలను.. ఈ స్ట్రాటజిస్టులు డామినేట్ చేస్తున్నారు. దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం ఉన్నా.. కొత్త తరహా రాజకీయం .. సోషల్ మీడియాలో దుమ్మురేపితేనే.. విజయం లభిస్తోంది. అందుకే అన్ని