YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమస్యలపై నిలదీసేందుకే జనసేన : పవన్ కళ్యాణ్

సమస్యలపై నిలదీసేందుకే జనసేన : పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం జిల్లాలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన మూడవ రోజు కొనసాగింది.జిల్లాలో పలు శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చెయ్యాలంటూ పవన్ ను కలసి వినతి పత్రం సమర్పించింది. అదేవిధంగా ఉద్దాన ప్రాంతం లోని బెంతు ఒరియా కులస్థులు గతం లో ఎస్టీ లు అయిన తమను.. తిరిగి ఎస్టీ లలో చేర్చకుండా రాజకీయాలు చేస్తున్నారని.. దీనిపై పవన్ స్పందించాలని కోరారు.. ఈ రెండు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. తరువాత పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అయన అన్నారు. అలాగే, పలాసలో మత్స్యకారుల సమస్యలు కన్నీరు పెట్టించాయన్నారు. ఓపెన్ వర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. సమస్యలపై నిలదీసేందుకే జనసేన స్థాపించానన్నారు. సమస్యలు తెలుసుకోవడానికే ఇక్కడకు వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇచ్చిన మాట తప్పి…అసలు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్న కేంద్రం, తెలుగుదేశం ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నిస్తానని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో  ఆ రెండు పార్టీలకూ తాను మద్దతు ఇచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే అప్పుడే చెప్పాననీ…మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుంటే వ్యతిరేకంగా పోరాటం చేస్తానని వారికి స్పష్టం చేశానన్నారు. ఇప్పుడు వారు నాడు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని, అందుకే ప్రత్యేక హోదా సాధన కోసం జనపోరాట యాత్ర చేపట్టానని అన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోతున్నదన్నారు. జరుగుతున్న అన్యాయాలకు కడుపు మండి తాను గళమెత్తుతున్నానన్నారు.

Related Posts