న్యూఢిల్లీ, నవంబర్ 26,
స్సోం, మేఘాలయ మధ్య చెలరేగిన మంటలు చల్లారడం లేదు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయ్. రెండు రాష్ట్రాల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకోవడంతో అస్సోం, మేఘాలయ అట్టుడుకుతున్నాయ్. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయ పౌరులు, ఒక అస్సోం అటవీ అధికారి ప్రాణాలు కోల్పోవడంతో ఇరు రాష్ట్రాల్లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయ్. అస్సోం నుంచి వస్తోన్న ట్రక్కులు, లారీలపై దాడులకు దిగుతున్నారు మేఘాలయ వాసులు. అల్లర్ల కారణంగా మేఘాలయకు ఇంధన సరఫరా నిలిపివేసింది అస్సోం పెట్రోల్ యూనియన్. దాంతో, మేఘాలయలో పెట్రో ఉత్పత్తుల కొరత ఏర్పడింది. పెట్రోల్ కొరత భయంతో బంకుల ముందు బారులు తీరుతున్నారు వాహనదారులు. ఏ పెట్రోల్ బంకు దగ్గర చూసినా కిలోమీటర్ల మేర క్యూ కనిపిస్తోంది. బంకుల దగ్గర రద్దీతో మేఘాలయలో పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది. వాహనదారుల్ని కంట్రోల్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.ఒకపక్క రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కల్లోలం రేపుతుంటే, మరోవైపు పెట్రో ఫైట్ మరింత మంటలు రాజేస్తోంది. తమ వాహనాలపై మేఘాలయ వాసులు దాడులు చేస్తున్నారని, అందుకే పెట్రో రవాణా నిలిపివేశామంటున్నారు అస్సోం వ్యాపారులు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు పెట్రోలియం ఉత్పత్తుల్ని సరఫరా చేసేది లేదంటున్నారు. దాంతో, రెండు రాష్ట్రాల బోర్డర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయ్ అక్కడ. అసోం నుంచి మేఘాలయ విడిపోయి ఐదు దశాబ్దాలవుతున్నా, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. అనేకసార్లు అల్లర్లు చెలరేగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మేఘాలయ ట్రక్కును అస్సోం అటవీ అధికారులు అడ్డుకోవడంతో మరోసారి హింస చెలరేగింది.సరిహద్దు గొడవలతో అసోం, మేఘాలయ అట్టుడుకిపోతుంటే, మరో రెండు రాష్ట్రాల మధ్య బోర్డర్ బ్లోఅవుట్ అంటుకుంది. కొత్తగా మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది. అస్సోం, మేఘాలయ కాంట్రవర్సీలాగే ఇది కూడా పాతదే. ఎన్నో ఏళ్లుగా మహారాష్ట్ర, కర్నాటక మధ్య బోర్డర్ ఇష్యూ నలుగుతోంది. లేటెస్ట్‌గా సరిహద్దు గ్రామాలపై యుద్ధానికి దిగాయి టు స్టేట్స్. హాట్ కామెంట్స్‌తో రెండు రాష్ట్రాల మధ్య మంటలు పుట్టిస్తున్నారు కర్నాటక, మహారాష్ట్ర లీడర్స్. ఒకవైపు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మ, ఇంకోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాటల తూటాలు విసురుకుంటున్నారు. కన్నడ, మరాఠి మాట్లాడే గ్రామాలు తమవంటే తమవంటూ హైవోల్టేజ్ స్టేట్స్‌మెంట్స్ ఇస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు కర్నాటక సీఎం బొమ్మ. ఫడ్నవిస్ మాటలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటూ మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే కామెంట్స్ మానుకోవాలంటూ హితవుపలికారు కర్నాటక సీఎం బొమ్మ. అస్సోం, మేఘాలయ మాదిరిగానే మహారాష్ట్ర, కర్నాటక మధ్య కూడా ఐదు దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. రెండు రాష్ట్రాలు కూడా న్యాయ పోరాటం చేస్తున్నాయ్. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను మహారాష్ట్ర బయటికి తీయడంతో వివాదం మొదలైంది. మహారాష్ట్రకు దీటుగా కర్నాటక కూడా రంగంలోకి దిగింది. బెల్గాం కోసం మహారాష్ట్ర.. సాంగ్లీ కోసం కర్నాటక లీగల్ ఫైట్ చేస్తున్నాయ్. ఎవరి వాదన వాళ్లు వినిపిస్తూ, వాటిని తమ రాష్ట్రాల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయ్.