YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లక్షా 40 వేల కోట్లు దాటేసిన జీఎస్టీ

లక్షా 40 వేల కోట్లు దాటేసిన జీఎస్టీ

ముంబై, డిసెంబర్ 2, 
జీఎస్‌టీ రాబడిలో భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. వరుసగా తొమ్మిదో నెలా రూ.1.40 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను ఆర్జించింది. నవంబర్లో రూ.1.46 లక్షల కోట్ల రాబడి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్‌తో పోలిస్తే రాబడి 3.9 శాతం తగ్గగా గతేడాది నవంబర్‌తో పోలిస్తే 10.9 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.52 లక్షల కోట్లు కాగా గతేడాది నవంబర్లో రూ.1.32 లక్షల కోట్లని కేంద్రం తెలిపింది.2022 అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్లో జీఎస్‌టీ రాబడి కాస్త తగ్గింది. ఆ త్రైమాసికం ముగింపు రాబడి తర్వాతి నెలలో ప్రతిబింబించింది. ఏదేమైనా ఎకనామిక్‌ యాక్టివిటీ ప్రతి నెలా పెరుగుతోంది' అని ఐసీఆర్‌ఏ చీఫ్ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. 'పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్లో జీఎస్‌టీ వసూళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎక్కువ సెలవులు రావడంతో జీఎస్‌టీ ఈవే బిల్లులు తగ్గాయి' అని నాయర్‌ వెల్లడించారు.
* నవంబర్లో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.25,681 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ రూ.32,651 కోట్లు. ఐజీఎస్‌టీ రూ.77,103 కోట్లు. సెస్‌ రూపంలో రూ.10,433 కోట్లు వచ్చాయి.
* కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్‌టీ నుంచి రూ.33,997 కోట్లను సీజీఎస్‌టీ, రూ.28,538 కోట్లను ఎస్‌జీఎస్‌టీలోకి సర్దుబాటు చేసింది. సర్దుబాటు తర్వాత కేంద్రానికి రూ.59,678 కోట్లు, రాష్ట్రాలకు రూ.61,189 కోట్లు దక్కాయి.
* వార్షిక ప్రాతిపదికన జీఎస్‌టీ రాబడి పెరుగుతూనే ఉంది. నవంబర్లో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం 14 శాతం కన్నా తక్కువ వృద్ధిరేటు నమోదు చేశాయి.
* బిహార్‌ (28%), అరుణాచల్‌ ప్రదేశ్ (55%), మణిపుర్‌ (42%), డామన్‌ అండ్‌ దియూ (67%), మహారాష్ట్ర (67%), పుదుచ్ఛేరి (22%), ఆంధ్రప్రదేశ్‌ (14%), లద్దాక్‌ (273%) నవంబర్‌ జీఎస్‌టీ వసూళ్లలో 14 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించాయి.
*తెలంగాణ 2021 నవంబర్లో రూ.3931 కోట్లు వసూలు చేయగా 2022 నవంబర్లో రూ.4,228 కోట్లు వసూలు చేసింది. 8 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆంధప్రదేశ్ గతేడాది నవంబర్లో రూ.2750 కోట్లు ఆర్జించగా ఈసారి 14 శాతం వృద్ధితో రూ.3134 కోట్లు పొందింది.
* జీఎస్‌టీ రెవెన్యూ ప్రొటెక్షన్‌ పీరియెడ్‌ జూన్‌ 30న ముగియడంతో గతేడాది ఇదే నెలలో 14 శాతం కన్నా ఎక్కువ వసూళ్లు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం జీఎస్‌టీ పరిహారం అందించదు.

Related Posts