YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

సీపీఎం కేంద్ర కార్యాలయంలో ముగిసిన పోలిట్ బ్యూరో సమావేశాలు

సీపీఎం కేంద్ర కార్యాలయంలో ముగిసిన పోలిట్ బ్యూరో సమావేశాలు

కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసింది. ప్రజాతీర్పును కాదని గోవా,మణిపూర్, మేఘాలయ,బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లుగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశా వివరాలు అయన మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాజకీయ పరిణామాలను స్వాగతించిన సీపీఎం పోలిట్ బ్యూరో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని అయన అన్నారు. బుధవారం కుమారస్వామి ప్రమాణస్వీకారానికి సీతారాం ఏచూరి,కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుకానున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్ జెడిఎస్ కు 56.6 శాతం ప్రజలు ఓటు వేశారు. బిజెపికి 36.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై తీవ్రంగా భారాలు పడుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా పెరిగాయని అయన అన్నారు. గడిచిన నాలుగేళ్ళలో  గ్రామీణ భారతం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది.. గతంలో ప్రజలు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. గ్యాస్ కు సబ్సిడీ ఇస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా వంట గ్యాస్ ధరలుకూడా భారీగా పెరిగాయి. నోట్లరద్దు,జిఎస్టీ వల్ల ప్రజలపై ఆర్థిక భారాలు మరింత పెరిగాయని అయన అన్నారు. ప్రజలపై భారాలు పెంచుతూ 11 లక్షల కోట్ల రుణాలను బడా కార్పొరేట్లకు బిజెపి ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రజలపై మోడీ ప్రభుత్వం వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పిలుపునిచ్చింది. త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చాక సీపీఎం కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు..50 పార్టీ కార్యాలయాలు ధగ్దం చేశారు,ఆర్ ఎస్ ఎస్ బిజెపి దాడులతో 500 కార్యకర్తలు ఇళ్ళను వదిలి పార్టీ ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో ఉంటున్నారని అన్నారు

Related Posts