విజయవాడ, డిసెంబర్ 9,
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం అంతర్గతంగా పలు సర్వేలు నిర్వహిస్తోంది. వాలంటీర్ల నుండి వస్తున్న సమాచా రంతోపాటు సొంత వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందుతున్న ప్రజల్లో సంతృప్తి ఎలా ఉందనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. అలాగే ప్రజాప్రతినిధుల పనితీరుమీద ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఇంటింటికీ వైసిపి కార్యక్రమం లో పలుచోట్ల నిలదీతలు ఎదురవడంతో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందనే కోణంలోనూ ప్రభుత్వం, వైసిపి నాయకులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమం లో సంక్షేమ పథకాల అమలు తీరుపై అంతర్గతంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఎక్కువచోట్ల నుండి కొంత అనుకూలత ఉన్నప్పటికీ పెరిగిన భారాల వల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతు న్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమచేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాలు కొంత తగ్గాయి. గతంలో ఏ పథకం అమలు చేయాలన్నా నేరుగా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్లి పెద్దఎత్తున సభలు నిర్వహించి ప్రచారం చేసి వచ్చేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల ఎమ్మెల్యేలతో పెద్దగా అవసరం లేకుండా పోయిందనే అభిప్రాయం ప్రజల్లో వెల్లడైనట్లు తెలిసింది. లబ్ధిపొందిన వారు ఓట్లు వేయకపోతారా అనే అబి óప్రాయంతో ప్రజా ప్రతినిధులూ ఉన్నట్లు తెలిసింది. ఇది క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం కలిగించే అంశమని వైసిపి నేతలూ భావిస్తున్నారు. మరోవైపు పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పెరిగా యి. జిల్లా స్థాయిలో జెడ్‌పి ఛైర్మన్లు, ఎమ్మెల్యేల మధ్య పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఇబ్బందేననే కోణంలో నాయకులు ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేస్తు న్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలనూ కలుసుకునే విధంగా ప్రభుత్వం నిరంతర కార్యా చరణకు రూపకల్పన చేయనున్నట్లు సమాచా రం. సుమారు 50 ప్రధాన కార్పొరేషన్లకు సంబంధించి ఆయాకులాల వారీగా వేర్వేరు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వం వైపు నుండి కులాల వారీగా బుక్‌లెట్లు ప్రచురిస్తున్న ట్లు తెలిసింది. ఇంటింటికీ వైసిపిలో పంచిన వివరాలు కాకుండా ఇక ముందు కార్పొరేషన్ల వారీగా సమాచారం తీసుకుని, వాటిని ఆయా కులాల సభల్లో పంచనున్నారు. ఈ కార్య క్రమాలన్నిటికీ సిఎం నేరుగా హాజరవ్వాలని నిర్ణయిం చుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడం, అదే వేదికపై ఎమ్మెల్యేలు, ఎంపిలకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రజల్లో అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అనంతరం మరో విడత ప్రజా ప్రతినిధులందరూ ఇంటింటికీ వెళ్లే కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పంచాయతీ సర్పంచుల వ్యవహారమూ స్థానికంగా వైసిపికి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. వార్డు, గ్రామ సచివాలయాలతో స్థానికంగా సర్పంచులు, ఎంపిపిలకు విలువ లేకుండా పోయిందనే అభిప్రాయం రావడంతో దాన్ని కూడా సరిచేసే కోణంలో ప్రభుత్వం ఉంది.