న్యూఢిల్లీ, డిసెంబర్ 9,
రెండు రాష్ట్రాలు బీజేపీకి ఆయువుపట్టుగా మారాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలు ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి కీలకంగా మారనున్నాయి. 105 స్థానాలు ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో సత్తా చాటితే అధికారం చేజిక్కించుకోవడం సులువు అని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎంపీ ఎన్నికల వరకు ఈ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి.దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్నా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 79 ఎంపీ స్థానాలుండగా 2019 ఎంపీ ఎన్నికల్లో 61 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ రెండో సారి అధికారంలోకి రావడానికి యూపీ ఫలితాలు కీలకంగా మారాయి. గుజరాత్‌లో సైతం 2019 లోక్ సభ ఎన్నికల్లో 26 స్థానాలకు గాను బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 255 సీట్లలో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకుంది. 2024లో రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉండటం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు.రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 105 ఎంపీ స్థానాలు ఉండగా అధికారంలోకి రావాలనుకునే పార్టీకి ఈ రెండు అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. అందులో భాగంగానే మోడీ అమిత్ షా ద్వయం మూడో సారి అధికారం చేపట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సత్తా చాటిన ఊపుతో ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రచార బాధ్యతలను ఈ సారి కూడా మోడీయే తీసుకుని ముందుకు సాగనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన ఈ రెండు రాష్ట్రాల ప్రజలు మరి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.దేశంలో మొత్తం 543 ఎంపీ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలను గెలుచుకుంది. పొత్తులో భాగంగా మొత్తం 353 స్థానాలను కైవసం చేసుకుని వరుసగా రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారం చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితమైంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీ రెండో సారి 303 సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎంపీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272 సాధించాలంటే కావల్సిన ఎంపీ స్థానాల విషయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషించనున్నాయి.
సీపీఎం రికార్డు సమం చేసిన బీజేపీ
గుజరాత్‌లో బీజేపీ రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే, పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం రికార్డును సమం చేసింది బీజేపీ. ఇక ఈ విజయంతో గుజరాత్‌లో వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ.గుజరాత్‌లో 1995లో 121 స్థానాలు గెలిచిన బీజేపీ, 1998లో 117 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో 127 సీట్లు కైవసం చేసుకుంది.2007లో 117 స్థానాల్లో గెలుపొందింది బీజేపీ పార్టీ. 2012లో 115 స్థానాలు గెలుచుకుంది. కానీ 2017లో 99కి పరిమితం అయింది భారతీయ జనతా పార్టీ. కానీ.. ప్రస్తుతం 156కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ పార్టీ. దీంతో బీజేపీ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.