YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పొలిటికల్ పార్టీల 2019 ప్రిపరేషన్!

ఏపీలో పొలిటికల్ పార్టీల 2019 ప్రిపరేషన్!

నవ్యాంధ్ర అభివృద్ధిపై నిర్లక్ష్యంగా ఉన్న కేంద్రంపై పోరు ఉధృతం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇప్పటికే ఏప్రిల్ 20న ధర్మపోరాటం చేసిన ఆయన తాజాగా విశాఖపట్నంలోనూ తన ఆవేదన వినిపించారు. విశాఖలో జరిగిన ధర్మపోరాటం కార్యక్రమంలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయడంతో పాటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి అంతంతమాత్రంగానే సాయం అందుతున్నా.. చిత్తశుద్ధితో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇదిలాఉంటే ముఖ్యమంత్రి పోరాటంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు అందిస్తూనే ఉందని చెప్తోంది. ఎన్డీయే సర్కార్ నవ్యాంధ్ర అభివృద్ధికి కట్టుబడే ఉందని స్పష్టంచేస్తోంది. ఈ పోరాటాల సంగతి ఎలా.. రాజకీయ పార్టీలు మాత్రం ప్రజలకు చేరువలో ఉండడంలో విజయవంతమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష.. టీడీపీకి కొంత ప్లస్ అయిందని ఆ పార్టీ ఈ పోరును మరింతగా ఉధృతం చేయడం కలిసివచ్చే అంశమే అని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలాఉంటే విపక్షం వైసీపీ కూడా.. ప్రజల్లో ఫోకస్ అయ్యే కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్రతో వైసీపీ అధినేత జగన్ పర్యటనలు చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ లోటుపాట్లను హైలైట్ చేస్తూ ప్రజల పక్షాన తామే చిత్తశుద్ధితో పోరాడగలమని అంటున్నారు. రాష్ట్రంలోని ఇబ్బందులు తొలగిపోవాలంటే తమకు పట్టం కట్టాలని కోరుతున్నారు. ఇక జనసేన సైతం ప్రజలకు చేరువలో ఉండే కార్యక్రమం కొనసాగిస్తోంది. ఆ పార్టీ అధినేత శ్రీకాకుళంలో బస్సుయాత్రలో నిమగ్నమయ్యారు. భావోద్వేగ ప్రసంగాలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ దూసుకెళ్తున్నారు. మొత్తంగా ఆంద్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలన్నీ తమదైన కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలకు ఇప్పట్నుంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి.

Related Posts